Bengal Train Accident | పట్టాలు తప్పిన సికింద్రాబాద్ – షాలిమార్ ఎక్స్ ప్రెస్
Bengal Train Accident | పశ్చిమ బెంగాల్‌లోని హౌరా సమీపంలో శనివారం తెల్లవారుజామున 5:30 గంటలకు సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (West Bengal train derailment) కు చెందిన టి హ్రీ కోచ్‌లు పట్టాలు తప్పాయి. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని నల్పూర్ స్టేషన్‌లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన కోచ్‌లలో పార్శిల్ వ్యాన్, B1 ప్యాసింజర్ కోచ్ ఉన్నాయి.
నల్పూర్ స్టేషన్‌లో రైలు మిడిల్ లైన్ నుంచి డౌన్ లైన్‌కు మారుతుండగా పట్టాలు తప్పినట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) ఓంప్రకాష్ చరణ్ తెలిపారు. “ఈ ఉదయం, 5.30 గంటలకు, 22850 సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ నల్పూర్ రైల్వే స్టేషన్‌లో మిడిల్ లైన్ నుంచి డౌన్ లైన్‌కు వెళుతుండగా పట్టాలు తప్పింది. ఇందులో ఒక పార్శిల్ వ్యాన్, రెండు ప్యాసింజర్ కోచ్‌లు పట్టాలు తప్పాయి” అని అధికారి తెలిపారు.
సంత్రాగచ్చి, ఖరగ్‌పూర్ నుంచి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను హుటాహుటిన అక్కడికి పంపించారు. అదనంగా, బాధిత ప్రయాణికులను కోల్‌కతాకు తరలించడానికి బస్సులను ఏర్పాటు చేశారు.
నల్పూర్ వద్ద పట్టాలు తప్పిన ఘటన (Bengal Train Accident )కు ప్రతిస్పందనగా, భారతీయ రైల్వేలు బాధిత ప్రయాణికులకు మరియు వారి కుటుంబాలకు సహాయం చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది. హెల్ప్‌లైన్‌లు క్రింది విధంగా ఉన్నాయి: షాలిమార్ – 62955 31471, 45834 (రైల్వే); సంత్రాగచ్చి – 98312 43655, 89102 61621; ఖరగ్పూర్ – 63764 (రైల్వే), P/T 032229-3764; మరియు హౌరా – 75950 74714.
Another day, another #TrainAccident!
Shalimar Secunderabad Express train met with an accident near Howrah in West Bengal. 3 coaches have been derailed.
When will the callous Railway Minister @AshwiniVaishnaw take responsibility? The public deserves answers & action. pic.twitter.com/Q4cnIfJdl0
— Nilanjan Das (@NilanjanDasAITC) November 9, 2024
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.