Bengal Hooghly Rape Case | పశ్చిమ బెంగాల్ లో మరో ఘోరం..
Bengal Hooghly Rape Case | కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో గత నెలలో జరిగిన క్రూరమైన అత్యాచారం హత్య కేసుకు సంబంధించి ఇంకా ఆగ్రహావేశాలు, నిరసన జ్వాలలు చల్లారకముందే.. మరో ఘోర సంఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో శుక్రవారం రాత్రి 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా “లైంగిక వేధింపులకు” గురైంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, హుగ్లీ జిల్లాలోని హరిపాల్ ప్రాంతంలో రోడ్డు పక్కన పాక్షికంగా నగ్న స్థితిలో బాలిక అపస్మారక స్థితిలో కనిపించడం అందరినీ కలవరపాటుకు గురిచేసింది.
నివేదిక ప్రకారం, శుక్రవారం రాత్రి 15 ఏళ్ల బాలిక ట్యూషన్ తరగతులకు హాజరైన తర్వాత ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కొందరు దుండగులు బాలికపై లైంగిక వేధింపులకు గురిచేసి బట్టలు చిరిగిపోయి అపస్మారక స్థితిలో రోడ్డుపై పడవేశారు. బాలికను ఆసుపత్రిలో చేర్చారని, అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆమె అత్యాచారానికి గురైందో లేదో నిర్ధారించేందుకు అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియా పోస్ట్‌లో పశ్చిమ బెంగాల్ పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు అనుమానితులెవరినీ గుర్తించలేదని, ఈ సంఘటనపై పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
టీఎంసీ తీరుపై బీజేపీ ఆగ్రహం
Bengal Hooghly Rape సంఘటనపై బిజెపి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కార్నర్ చేసింది, బాలికను చేర్చిన ఆసుపత్రిలోకి మీడియాను అనుమతించకుండా కేసును కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. ఒక X పోస్ట్‌లో, BJP T సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఇలా అన్నారు, “మమతా బెనర్జీ పోలీసులు ఆసుపత్రిని చుట్టుముట్టారు, మీడియాను అనుమతించడం లేదు. సంఘటన గురించి బయటకు పొక్కకుండా చూసేందుకు స్థానిక TMC నాయకులు చుట్టూ తిరుగుతున్నారు”. పశ్చిమ బెంగాల్ మహిళలకు “అత్యంత అసురక్షిత ప్రదేశం” అని మాల్వియా పేర్కొన్నారు. బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘‘మమతా బెనర్జీ విఫలమయ్యారు. ఆమె వెంటనే దిగిపోవాలి., రాష్ట్రంలో అత్యాచారం, పోక్సో కేసులను పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయలేదు, ”అని రాశారు.
కోల్‌కతాలో డాక్టర్ అత్యాచారం హత్య
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై క్రూరమైన అత్యాచారం హత్య జరిగిన దాదాపు నెల రోజుల తర్వాత తాజాగా హూగ్లీ రేప్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించింది.
వైద్యురాలి మృతదేహం ఆగస్టు 9 ఉదయం ఆసుపత్రి సెమినార్ గదిలో రక్తసిక్త స్థితిలో కనిపించింది, ఈ కేసుకు సంబంధించి నిందితుడు సంజయ్ రాయ్ అనే సివిల్ వలంటీర్‌ను అరెస్టు చేశారు.
ఘోరమైన రీతిలో ట్రైనీ డాక్టర్ పై లైంగిక వేధింపులకు పాల్పడడంతో దేశవ్యాప్తంగా వైద్యుల నుంచి నిరసనలు పెల్లుబికాయి. ఇది కేంద్ర చట్టం ద్వారా వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది వైద్యులు సమ్మెలు చేశారు. ఆగస్టు 13న కలకత్తా హైకోర్టు కోల్‌కతా పోలీసుల నుంచి దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ ఆగస్టు 14న దర్యాప్తు ప్రారంభించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..