New Delhi : అక్రమ బంగ్లాదేశీ వలసదారుల (Bangladesh Immigrants) సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ పోలీసులు (Delhi Police ) నగరవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈప్రయాత్నాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా రాజధానిలో సుమారు 175 మంది వ్యక్తులను పోలీసులు గుర్తించారు.
స్థానిక అధికారుల సహకారంతో అనుమానితుల మూలాలను ధృవీకరించడానికి బృందాలను పంపి, ఔటర్ జిల్లాలో సోదాలు, ఇంటింటికీ తనిఖీలు నిర్వహించారు. , ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ, “ఏ చెల్లుబాటు అయ్యే భారతీయ పత్రాలు లేకుండా దేశంలో నివసిస్తున్న బంగ్లాదేశ్ వలసదారులు అక్రమంగా ఉంటున్నారని తెలిపారు. అక్రమ వలసదారులతో పెరుగుతున్న సమస్యల నేపథ్యంలో ఔటర్ జిల్లా పోలీసులు చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా ఢిల్లీలో నివసిస్తున్న వ్యక్తులను గుర్తించడం ప్రారంభించారు. అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకొని వారి స్వదేశానికి పంపించే యత్నాలను ముమ్మరం చేశారు. . ఔటర్ డిస్ట్రిక్ట్ అధికార పరిధిలో ఇటీవల ఆపరేషన్లు/ఉమ్మడి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అక్రమ వలసదారులపై కఠిన చర్యలు
Bangladesh Immigrants in india : డిసెంబరు 12న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD) సీనియర్ అధికారులతో కలిసి ఢిల్లీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్) అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలుతీసుకున్నారు. పొరుగు దేశంలో హిందువులు, ఇతర మైనారిటీలపై అఘాయిత్యాలు పెరిగిన నేపథ్యంలో భారతదేశంలో అక్రమ వలసదారులపై అణిచివేత ప్రక్రియ తెరపైకి వచ్చింది.
ఈ విషయమై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సచ్‌దేవా ANIతో మాట్లాడుతూ, “రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఢిల్లీ పౌరుల హక్కులను హరిస్తున్నారు. ఈ అక్రమ వలసదారులను వెనక్కి పంపించాలని మేము పదేపదే డిమాండ్లు చేశాం ఢిల్లీ భారతీయులకు చెందినది. AAP వలసదారులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పిస్తోంది. దీనికి ఆ పార్టీ సమాధానం చెప్పాలి. హర్దీప్ పూరీ జీ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మేము బంగ్లాదేశీయులకు లేదా రోహింగ్యాలకు ఎటువంటి గృహాలను కేటాయించలేదు. తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆప్ అలా చేస్తోంది అని విమర్శించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..