Violence Against Hindus | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిపై స్పందించిన ప్రీతీ జింటా
Bangladesh Crisis | భారతదేశం పొరుగు దేశం బంగ్లాదేశ్ అల్లర్లు, ఘర్షణలతో అట్టుడికిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపోయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీ కమ్యూనిటీపై హింస (Violence Against Hindus) కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు, ప్రీతి జింటా ఆ సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. తన X (ట్విట్టర్ ) హ్యాండిల్‌లో ఒక పోస్ట్ ను పంచుకుంది.
Devastated & heartbroken to hear of the violence in Bangladesh against their minority population. People killed, families displaced, women violated & places of worship being vandalized & burnt. Hope the new govt. takes appropriate steps in stopping the violence & protecting its…
— Preity G Zinta (@realpreityzinta) August 10, 2024
Violence Against Hindus ; బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజంపై ఇటువంటి దాడులను ఖండిస్తూ, ప్రీతి ఇలా వ్రాశారు, ”బంగ్లాదేశ్‌లో అక్కడి మైనారిటీ జనాభాపై జరుగుతున్న హింస గురించి విని నా గుండె పగిలింది. ప్రజలు హత్యకు గురవుతున్నారు. కుటుంబాలు ఇండ్లు వదిలి పోతున్నారు. మహిళలపై అఘాయిత్యాలు, ప్రార్థనా స్థలాలు ధ్వంసం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వస్తుందని ఆశిస్తున్నాం. హింసను అరికట్టడంతోపాటు ప్రజలను రక్షించడంలో తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు. కష్టాలను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థనలు చేస్తున్నాను అని ‘సేవ్ బంగ్లాదేశీ హిందువులను’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఉపయోగించారు.
ఇదిలా వుండగా నటుడు సోనూ సూద్ (Sonu Sood) కూడా దేశంలో హింసాత్మక సంఘటనల గురించి మాట్లాడారు మిస్టర్ సిన్హా అనే నెటిజన్ షేర్ చేసిన వీడియోను మళ్లీ రీట్వీట్ చేశాడు, ఇందులో బంగ్లాదేశ్ హిందూ మహిళ తన బాధను వ్యక్తపరుస్తుంది. ”బంగ్లాదేశ్ నుంచి మా తోటి భారతీయులందరినీ తిరిగి తీసుకురావడానికి కృషి చేయాలి అని కోరింది. ఇది కేవలం మన ప్రభుత్వ బాధ్యతే కాదు, మనందరి సహకారం అవసరం అంటూ జై హింద్” అని తన పోస్ట్‌లో రాశారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..