Ayodhya Gangrape Case : కొన‌సాగుతున్న బుల్డోచ‌ర్ చ‌ర్య‌.. నిందితుడి షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత‌

Ayodhya Gangrape Case : కొన‌సాగుతున్న బుల్డోచ‌ర్ చ‌ర్య‌.. నిందితుడి షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత‌

Ayodhya Gangrape Case | లక్నో: అత్యాచార నిందితుడైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు మోయిద్ ఖాన్‌కు చెందిన అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను అయోధ్య జిల్లా యంత్రాంగం నేల‌మ‌ట్టం చేసింది. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.3 కోట్ల విలువైన భవనాన్ని కూల్చేందుకు మూడు బుల్‌డోజర్లు (bulldozers), ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించారు. భారీ భద్రత నడుమ కూల్చివేతలు జరిగాయి.

అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మోయిద్ ఖాన్ (65)ను అతని అసిస్టెంట్‌ రాజు ఖాన్‌తో పాటు జూలై 30న అరెస్టు చేశారు. అంతేకాకుండా, మైనర్ గ్యాంగ్‌రేప్ కు గురైన బాధితురాలు ఆగస్టు 7న లక్నోలోని ఓ హాస్పిటల్‌లో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) ప్రక్రియ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో అరెస్టయిన తర్వాత, ప్రధాన నిందితుడు మొయిద్ ఖాన్ మరొక అక్రమ నిర్మాణ‌మైన 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బేకరీని ఈ నెల ప్రారంభంలోనే బుల్డోజర్ తో కూల్చేశారు.

READ MORE  అయోధ్య లో సొంతిల్లు కావాల‌నుకునేవారికి సువ‌ర్ణావ‌కావం.. రామాల‌యానికి ద‌గ్గ‌ర‌లోనే 'వశిష్ఠ్‌ కుంజ్‌ టౌన్‌షిప్‌

షాపింగ్ కాంప్లెక్స్ చట్టబద్ధతపై రెవెన్యూ శాఖ ప్రశ్నించగా, కాంప్లెక్స్ చట్టబద్ధత నిరూపించకపోతే నిర్మాణాన్ని కూల్చివేసే అధికారం ఉంద‌ని పేర్కొంటూ మొయిద్ ఖాన్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం, అయోధ్యలోని పూరకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భదర్సాలోని పబ్లిక్ రోడ్డుపై కాంప్లెక్స్ నిర్మించారు. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ADA), సెక్రటరీ సత్యేంద్ర సింగ్ ప్రకారం, SDM సోహవాల్ నివేదిక ఆధారంగా షాపింగ్ కాంప్లెక్స్‌ను కూల్చివేశారు. మోయిద్ ఖాన్‌కు చెందిన ఇతర అక్రమ ఆస్తులు ప్రాథమిక పాఠశాల భూమితో సహా ప‌రిశీల‌న‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

“అయోధ్య జిల్లా అధికారులు కూల్చివేసిన అక్రమ కాంప్లెక్స్ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా నిర్మించారు. నిర్మాణానికి ప్ర‌భుత్వ అనుమ‌తి క‌లిగిన బిల్డింగ్ ప్లాన్ లేదు. అధికారుల తనిఖీల తరువాత యజమానికి అనేకసార్లు నోటీసులు అందించారు. ”అని సింగ్ అయోధ్యలో మీడియా ప్రతినిధులతో అన్నారు.
అయిన‌ప్ప‌టికీ బిల్డర్ ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. జూన్‌లో, కోర్టు కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చర్య ఆ ఉత్తర్వుకు అనుగుణంగా జరుగుతోంది, ”అన్నారాయన.

READ MORE  Bulldozer Action | మైనర్ బాలికపై రేప్‌ కేసులో నిందితుడి బేకరీని కూల్చేసిన ప్రభుత్వం.. Video

4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేతకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కూల్చివేతకు ఒక రోజు ముందు, కాంప్లెక్స్ లోపల పనిచేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మరో చోటికి మార్చబడింది.

గురువారం మూడు బుల్‌డోజర్లు, ఒక ఎక్స్‌కవేటర్, మూడు కంపెనీల పీఏసీ, పలు పోలీస్ స్టేషన్‌ల నుంచి బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఏడీఏ కార్యదర్శి సత్యేంద్ర సింగ్‌, ఎస్‌డీఎం సోహవల్‌ అశోక్‌ కుమార్‌ సైనీ ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి. భదర్స మునిసిపల్ పంచాయితీ చైర్మన్, నిందితుడి సన్నిహితుడు రషీద్ కూడా అత్యాచార బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేసినందుకు పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. రషీద్ ఆయుధ లైసెన్స్‌లు రద్దు చేశారు. అంతేకాకుండా అతనికి కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, రషీద్ తన స్టేట్‌మెంట్ ఇవ్వడానికి స్థానిక పోలీస్ స్టేషన్‌కు హాజరు కాలేదు. మరోవైపు, మొయిద్ ఖాన్ కూడా పోక్సో కోర్టులో బెయిల్ దాఖలు చేశారు.

READ MORE  Ayodhya : ఉగ్రదాడులతో అయోధ్యలో హై అలర్ట్‌..

SDM అశోక్ కుమార్ సైనీ ప్రకారం, ప్రాథమిక పాఠశాల కోసం భూమిలో ఎక్కువ భాగం రషీద్ నిర్వహిస్తున్న‌ మదర్సా అక్రమంగా ఆక్రమించి ఉంది. రషీద్‌కు సంబంధించిన అక్రమ టెండర్లు, పనులపై విచారణ జరిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. నిందితులకు డీఎన్‌ఏ పరీక్షలు చేసేందుకు అయోధ్య పోలీసులు చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించారు. “DNA పరీక్షలు కచ్చిత‌మైన సాక్ష్యాలను అందిస్తాయి” అని ఒక అధికారి చెప్పారు.


న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

One thought on “Ayodhya Gangrape Case : కొన‌సాగుతున్న బుల్డోచ‌ర్ చ‌ర్య‌.. నిందితుడి షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *