Saturday, August 30Thank you for visiting

Ayodhya Deepotsav 2024 | దేదీప్యమానంగా అయోధ్య .. 28 లక్షల దీపాల‌తో గిన్నిస్ రికార్డ్..

Spread the love

Ayodhya Deepotsav 2024 | దీపావళి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని యూపీలోని టెంపుల్ సిటీ అయోధ్యలో ఏర్పాటు చేసిన భవ్య దిపోత్సవ్ కార్యక్రమం అంగ‌రంగ వైభ‌వంగా సాగింది. భవ్య దిపోత్సవ్ వేడుకల సందర్భంగా అయోధ్య రామ మందిరంలో 28 లక్షల దీపాల‌ను వెలిగించారు. సరయూ నది ఘాట్ లో 1,100 మంది భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో హారతులు ఇచ్చారు. 28 లక్షల దివ్వెల వెలుగులతో భవ్య దిపోత్సవ్ గిన్సిస్ వరల్డ్ రికార్డ్ ను కైవ‌సం చేసుకుంది. లక్షలాది మంది భక్తుల నడుమ అయోధ్య వీధుల్లో రామలక్ష్మణుల శోభాయాత్ర జ‌రిగింది. ఈ రామలక్ష్మణుల రథాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ లాగారు.

అయోధ్యలో రామమందిరంలో మొదటి దీపోత్సవ్‌ – 2024 వేడుకలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. .  గుప్తార్ ఘాట్, బడీ దేవ్కాలీ, రామ్ ఘాట్, బిర్లా ధర్మశాల, భారత్ కుండ్, తులసి ఉద్యాన్ తదితర అయోధ్య అంతటా ప్రముఖ వేదికల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో తొలసారి అంగరంగ వైవంగా దీపావళి జరుగుతోంది. ‘అయోధ్యలోని రామ్ లల్లా జన్మస్థలంలో నిర్మించిన ఆలయంలో వేలాది దీపాలు వెలిగిస్తే… మన రాముడు మరోసారి తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇది అలాంటి దీపావళి అవుతుంది. ఈసారి నిరీక్షణ 14 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాలు” అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

30,000 మంది వలంటీర్లు

30,000 కంటే ఎక్కువ మంది వలంటీర్లు కీలక ప్రదేశాలతో సహా 55 ఘాట్‌లలో దీపాలను ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా ప్రముఖులు కూడా పాల్గొన్నారు,

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *