Astro Horoscope | ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి.. !

Astro Horoscope | ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి.. !

Astrology : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 మార్చి 24 ఆదివారం నుంచి మార్చి 30 శనివారం వరకు వారం రోజుల్లో  రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు

మేష రాశి

Astro Horoscope : మేష రాశి వారికి ఈ వారంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. ఒక స్నేహితుని సహాయం ఆనందాన్ని కలిగిస్తుంది. Emitation జువెలరీ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. గురువుగారి అనుగ్రహం మరియు దైవానుగ్రహం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. ఇతరులు మీ మాటలతో ఏకీభవిస్తారు. జీవిత భాగస్వామితో శాంతంగా వ్యవహరించాలి. రాజకీయ రంగంలో ఉన్నవారు ఒక వర్గానికి నాయకత్వం వహిస్తారు. కళా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవాలి కారణం శరీరమునకు గాయాలు అయ్యే అవకాశం కలదు. శరీరం బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. అనవసరమైన ఖర్చుల మీద పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. అప్పు కొంత తీర్చగలుగుతారు. దుర్గాదేవి అమ్మ వారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారంలో శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం చేయవలసి వస్తుంది. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును. విద్యార్థులకు మంచి కాలము. Chit Fund మరియు Book Stall వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ప్రతి చిన్న విషయంలోనూ మొండితనం అంత మంచిది కాదు. మీడియా రంగంలో ఉన్నవారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. పంటి నొప్పితో ఇబ్బంది పడతారు. వ్యాపార భాగస్వాములతో ఒప్పందం కుదురుతుంది. భూమికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. స్నేహితునికి ఆర్థిక సహాయం చేస్తారు. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుకై కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. సోమరితనం వలన పనులు వాయిదా వేస్తారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలము. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మిధున రాశి

ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపార భాగస్వామితో legal issues వచ్చే అవకాశాలు కలవు. స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. తండ్రితో అకారణ వైరములకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు యోగ కాలము. వైద్య వృత్తిలో ఉన్న ఉద్యోగస్తులకి అధికారుల నుంచి సమస్యలు ఉండను. వెండి మరియు ముత్యం వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉండును. రాజకీయంలో ఉన్నవారు శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగడ్తారు. స్త్రీలు అందం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. శారీరక శ్రమ గోచరిస్తుంది. జ్వరంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. కుటుంబ సభ్యులతో యాత్రలు చేసే అవకాశం కలదు. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. వ్యాయామం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. బ్యాంక్ లోన్స్ మంజూరు అవుతాయి. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Horoscope Weekly | ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి..

 కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనవసరమైన ప్రయాణములు చేయవలసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగి సఖ్యత బలపడుతుంది. Revenue Department వారికి పదోన్నతులు ఉండును. ప్రభుత్వానికి సంబంధించిన పర్మిషన్స్ మంజూరు అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. గొడవల జోలికి పోవడం వలన నష్టపోయే అవకాశం కలవు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేయికురుతుంది. అప్పు తీర్చే విషయమై ఉన్న మానసికపరమైన వత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అజీర్ణంతో ఇబ్బంది పడే వారికి ఉపశమనం ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజా వ్యతిరేకత ఉండును. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

సింహరాశి

సింహ రాశి వారికి ఈ వారంలో కుటుంబ పరమైన కలహాలు ఉండను. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. వివాహ ప్రయత్నాలు చేసే వారు శుభవార్త వింటారు. మీ జీవిత భాగస్వామితో శాంతంగా వ్యవహరించాలి. తండ్రి వృత్తిలో ఉన్నవారికి ఇబ్బందులు ఉండును. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. ఇమిటేషన్ జ్యువలరీ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. ప్రయాణాలలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. ఏ నిర్ణయమైనా తల్లితో చర్చించి తీసుకుంటారు. బ్యాంకు రుణాలు ఆలస్యం అవుతాయి. IT రంగంలో ఉన్నవారికి మానసికపరమైన ఒత్తిడి ఉండును. ధనపరమైన ఇబ్బందులు ఉండును. ఆకస్మిక విదేశీ పర్యటన చేయవలసి వస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. లలితా దేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ వారంలో నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ఆరోగ్యపరమైన శ్రద్ధ వహించాలి. రాజకీయాలలో ఉన్న వారికి సభ గౌరవం లభిస్తుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. Agriculture department ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఇబ్బందులు ఉండును. పండ్ల వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా ఆలస్యం అవుతుంది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. సినిమా రంగంలో ఉన్న వారికి అవకాశాలు చేయి జారిపోతాయి. విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. తండ్రి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్న వారికి ఇబ్బందులు ఉండను. ఏ నిర్ణయమైనా మనోధైర్యంతో తీసుకుంటారు. తిను బండారాలకు సంబంధించిన వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. గృహము నందు శుభకార్యాలు నిర్వహిస్తారు. మీ వ్యాపార భాగస్వామితో ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. వేడి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. ధనపరమైన వెసులుబాటు ఉంటుంది. వీరభద్ర స్వామి ఆరాధన చేయడం చెప్పదని సూచన.

READ MORE  Ugadi Panchangam Makar Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: మకర రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సోదరి సోదరులతో సఖ్యత బలపడుతుంది. విద్యార్థులు శ్రమించవలసిన సమయం. స్త్రీలు వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కారణం శరీరానికి గాయాలయ్య అవకాశం కలదు. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. తల్లితో తగాదాలకు దూరంగా ఉండాలి. వడ్డీ వ్యాపారస్తులకు మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేకూరుతుంది. నూతన వాహన ప్రయత్నాలు వాయిదా వేసుకుంటారు. మీ ఎదుగుదలను చూసి తల్లితండ్రులు ఆనందిస్తారు.
అనవసరమైన ఆలోచనల జోలికి పోకూడదు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలుగుతాయి. Real Estate వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. తగాదాలకు దూరంగా ఉండాలి. సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఇబ్బందులు ఉండును. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ఈ వారంలో దైవానుగ్రహం ఉంటుంది. అల్లం మరియు ఉల్లిగడ్డ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సోదరీ సోదరతో స్థిరాస్తులకు సంబంధించిన చర్చలు కొలిక్కి వస్తాయి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కళా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. సంతాన భవిష్యత్తుకై ధనాన్ని పొదుపు చేస్తారు. అన్ని విధాల అదృష్టం తోడవుతుంది. జీవిత భాగస్వామితో తగాదాలకు దిగడం అంత మంచిది కాదు. గృహంలో దైవతా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాన్ని విస్తరించాలనె ఆలోచన బలపడుతుంది. బ్యాంక్ లోన్స్ ఆలస్యం అవుతాయి. సంగీతం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. సూర్య నమస్కారాలు చేయడం చెప్పదగిన సూచన.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారంలో అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. విలాసవంతంగా కాలాన్ని గడుపుతారు. ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాలి. Paints వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. ప్రభుత్వానికి సంబంధించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శత్రువులతో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. Chit Fund వ్యాపారస్తులకు పాత బాకీలు వసలవుతాయి. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. దేవాదాయ శాఖలో పనిచేసే వారికి పదోన్నతులు ఉండును. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. అప్పులు కొంతమేరకు తీర్చగలుగుతారు. మీ జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  మణిపూర్ : మూడు ఇళ్లను దగ్గం చేసి, భద్రతా దళాల ఆయుధాలను లాక్కెళ్లిన దుండగులు

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారంలో దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. స్త్రీల కొరకు ధన వ్యయం చేయవలసి వస్తుంది. కోపాన్ని మరియు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులకు మంచి కాలము. నడుము నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. Software ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉండును. Kangan hall వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. ఆస్తి కొనుగోలు విషయమై స్నేహితులతో చర్చలు నిర్వహిస్తారు. ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరం. తీర్థయాత్రలు చేస్తారు. శత్రువుల మీద వ్యూహ రచన చేస్తారు. బ్యాంక్ లోన్ కొంత ఆలస్యానా మంజూరు అవుతుంది. మీ దగ్గర వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కలదు. మతిమరుపు వలన సమస్యలు వచ్చును. మీ పిల్లల బలహీనతలను ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడండి. కాలభైరవ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

 మీన రాశి

( 24 – 30 March 2024 )  మీన రాశి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో తగాదాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. చెడు వ్యసనాల జోలికి పోకూడదు. మీ తెలివితేటలతో వ్యాపారంలో అధిక లాభాలను పొందగలుగుతారు. వారాంతంలో శారీరక శ్రమ గోచరిస్తోంది. నూతన వస్త్ర లాభం కలదు. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలి కారణం శరీరానికి గాయాలయ అవకాశం కలదు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా సమయాన్ని గడుపుతారు. విద్యార్థులకు శుభ ఫలితాలు ఉండును. మీ సంతాన మాటతీరు మరియు ప్రవర్తనను చూసి ఆనందిస్తారు. మీరు ఇతరుల మీద చూపించే ప్రేమ,ఆరాటం వల్ల నష్టపోయే అవకాశం కలదు. ఇతరుల విషయాలలో తలదూర్చకూడదు. Skin infections వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. Hair fall ఒక సమస్యగా మారుతుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

Weekly Zodiac Sign By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *