Assembly Elections 2024 | మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల షెడ్యూల్ ఇదే..
Assembly Elections 2024 | భారత ఎన్నికల సంఘం (ECI) మంగళవారం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 20న మహారాష్ట్ర ఒకే దశలో అలాగే జార్ఖండ్ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 13, 20 తేదీల్లో దశలు ఎన్నికలు జరగుతాయని, ఫలితాలు నవంబర్ 23 న ప్రకటించనున్నామని తెలిపారు. మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఈసారి జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ పేర్కొంది.
మహారాష్ట్ర ఎన్నికల పూర్తి షెడ్యూల్
- గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 22
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 29
- నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 30
- అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 4
- పోలింగ్ తేదీ: నవంబర్ 20
- ఓట్ల లెక్కింపు తేదీ: నవంబర్ 23
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్
జార్ఖండ్‌లో రెండు దశల్లో నవంబర్ 13 నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుందని EC ప్రకటించింది.
దశ 1 (43 అసెంబ్లీ నియోజకవర్గాలు )
దశ 2 (38 అసెంబ్లీ నియోజకవర్గాలు )
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ:
దశ 1: 18.10.2024 (శుక్రవారం)
దశ 2: 25.10.2024 (శుక్రవారం)
నామినేషన్లు వేయడానికి చివరి తేదీ:
దశ 1: 22.10.2024 (మంగళవారం)
దశ 2: 29.10.2024 (మంగళవారం)
నామినేషన్ల పరిశీలన తేదీ:
దశ 1: 23.10.2024 (బుధవారం)
దశ 2: 30.10.2024 (బుధవారం)
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ:
దశ 1: 25.10.2024 (శుక్రవారం)
దశ 2: 01.11.2024 (శుక్రవారం)
పోలింగ్ తేదీ:
దశ 1: 13.11.2024 (బుధవారం)
దశ 2: 20.11.2024 (బుధవారం)
కౌంటింగ్ తేదీ:
23.11.2024 (శనివారం)
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..