
Rashi Phalalu (09-04-2025) : ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు మురళీధరా చార్యులు వివరించారు. 2025 ఏప్రిల్ 9న బుధవారం రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం
🐐 మేషం
09-04-2025)
Rashi Phalalu : ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. గ్రహబలంలో మార్పు లేదు. ఉద్యోగం విషయమై పై అధికారులతో కలుపుగోలుగా ముందుకు సాగాలి. దైవబలంతో పనులు పూర్తవుతాయి. మీ ధైర్యం సదా మిమ్మల్ని కాపాడుతుంది. అశ్వినీ నక్షత్ర జాతకులు ముఖ్యమైన కార్యక్రమాలు ఉదయం 10 తర్వాత చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. దుర్గాధ్యానం చేయడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి.
🐂 వృషభం
09-04-2025)
ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషమైన ప్రగతి సాధిస్తారు. అనుకూలత ఉంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. కొంతకాలంగా గ్రహబలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే విశేషమైన ఫలితాలను పొందుతారు. చతుర్ధంలో చంద్రుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. చంచల బుద్ధి రాకుండా చూసుకోవాలి. రోహిణీ నక్షత్ర జాతకులు కీలకమైన పనులను ఉదయం 10 తర్వాత చేసుకోవడం ఉత్తమం. ఇష్టదేవత ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది.
💑 మిధునం
09-04-2025)
ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తోటి వారి సహకారంతో ముందుకు సాగండి. అనవసర విషయాలలో తలదూర్చవద్దు. ఆరుద్ర నక్షత్ర జాతకులు నూతన కార్యక్రమాలను ఉదయం 10 నుంచి చేసుకోవడం ఉత్తమం. విష్ణు ఆరాధన మేలు చేస్తుంది.
🦀 కర్కాటకం
09-04-2025)
ఉద్యోగంలో అనుకూల ఫలితాలు రావడానికి చాలా శ్రమించాలి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. లక్ష్యాలను చేరుకునే క్రమంలో ముందస్తు ప్రణాళికలను రూపొందించాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా నిలకడగా ఉండేందుకు శ్రీలక్ష్మీ ధ్యానం చేసుకోవడం ఉత్తమం. పుష్యమీ నక్షత్ర జాతకులు ఉదయం 10 నుంచి క్షేమకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఘాత చంద్రదోషం ఉంది. దూరప్రయాణాలు చేయడం మంచిది కాదు. చంద్ర ధ్యానం చేసుకోవడం మంచిది.
🦁 సింహం
09-04-2025)
జన్మచంద్రబలం అనుకూలంగా ఉంది. మనోబలంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ కాలం కనిపిస్తోంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వృథా సంచారం వల్ల సమయం వృథా అవుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు సాగండి. మఖ నక్షత్ర జాతకులు ముఖ్యమైన పనులను ఉదయం 10 తర్వాత ప్రారంభించడం వల్ల మేలైన ఫలితాలు వస్తాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
💃 కన్య
09-04-2025)
ప్రశాంతమైన మనసుతో ముందుకు సాగండి. అనుకూలత వస్తుంది. ఉద్యోగంలో పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి.
వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు కీలకపాత్ర పోషిస్తాయి.మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు సదా విజయాన్ని ఇస్తాయి.హస్తా నక్షత్ర జాతకులు ఉదయం 10 తర్వాత కీలక పనులు ప్రారంభించడం ద్వారా శుభం చేకూరుతుంది. దుర్గాధ్యానం శుభాన్నిఇస్తుంది.
⚖ తుల
09-04-2025)
విశేషమైన గ్రహబలం ఉంది. ఏది అనుకుంటే అది పూర్తవుతుంది. అప్పగించిన బాధ్యతల్ని సకాలంలో పూర్తిచేసి అందరి మన్ననలను పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రగతిపథంలో ముందుకు సాగుతారు. స్వాతీ నక్షత్ర జాతకులు ఉదయం 10 తర్వాత కీలక పనులను ప్రారంభించడం మంచిది. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం.
🦂 వృశ్చికం
09-04-2025)
ప్రయత్నాలు నెరవేరుతాయి. దైవబలం సదా కాపాడుతుంది. ఆర్థిక పరంగా లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఏకాగ్రతతో పని చేయాలి. వ్యాపారంలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. అనూరాధ నక్షత్ర జాతకులకు ఉదయం 10 తర్వాత క్షేమకరమైన ఫలితాలు ఫలిస్తున్నాయి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన శక్తిని ఇస్తుంది.
🏹 ధనుస్సు
09-04-2025)
గ్రహబలం అనుకూలంగా లేదు. బాగా శ్రమతో కూడిన ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమయేవ జయతే అన్న విధంగా ముందుకు సాగండి. ఆర్థికపరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో కీలక లావాదేవీలు ఫలిస్తాయి. భాగ్యచంద్రుడు అనుకూలంగా లేడు. చంద్ర ధ్యానంతో పాటు దుర్గారాధన మేలు చేస్తుంది. మూల నక్షత్ర జాతకులకు ఉదయం 10 తర్వాత అనుకూల తారాబలం ఉంది. ఆ సమయంలో చేసే పనులు శుభాన్ని చేకూరుస్తాయి.
🐊 మకరం
09-04-2025)
ప్రారంభించబోయే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. వ్యాపారంలో బుద్ధిబలంతో పని చేయాలి. పెద్దల ఆశీస్సులు సదా కాపాడతాయి. అష్టమ చంద్రబలం అనుకూలంగా లేదు. దుర్గాధ్యానం తప్పనిసరిగా చేసుకోవాలి. శ్రవణ నక్షత్రం వారు ఉదయం 10 తర్వాత చేసుకునే పనులు విజయాన్ని అందిస్తాయి.
🏺 కుంభం
09-04-2025)
గ్రహబలం అనుకూలంగా ఉంది. మనఃసౌఖ్యంతో పాటు సౌభాగ్యసిద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో ఏకాగ్రతతో పనిచేస్తే ఫలితాలు బాగుంటాయి. అధికారుల మాటకు ఎదురు మాట్లాడకుండా వారికి తగినట్టుగా ముందుకు సాగండి. నూతన వస్త్ర లాభం ఉంది. శతభిషా నక్షత్ర జాతకులకు ఉదయం 10 తర్వాత కాలం అనుకూలిస్తోంది. ఇష్ట దేవతా ధ్యానం శుభప్రదం.
🦈 మీనం
09-04-2025)
ఆర్థికపరంగా చేసే కృషి ఫలిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు కూడా జరుగుతున్నాయి. మనోబలం సదా కాపాడుతుంది. పెద్దల ఆశీస్సులతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఉదయం 10 తర్వాత క్షేమకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది.
Rashi Phalalu By
మురళీధరా చార్యులు, జోత్యిష్య పండితులు
మెదక్ జిల్లా, Ph. 9652295899
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.