Apple iPhone | ఇక పాస్‌వర్డ్ అవసరం లేదు.. మీ గుండెచప్పుడుతోనే మీ స్మార్ట్ ఫోన్ అన్ లాక్
Unlocking with Heartbeats | మీరు మీ ఫోన్‌ని అన్‌లాక్ చేయడానికి పాస్‌వర్డ్, పిన్, టచ్ ఐడి, ఫేస్ ఐడి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి రకరకాల పద్ధతులను ఉపయోగించి ఉంటారు కదా.. అయితే వీటన్నింటికీ భిన్నంగా సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. Apple తన iPhone, Mac వంటి డివైజ్ ల కోసం కొత్త బయోమెట్రిక్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వీటిని అన్‌లాక్ చేయడానికి మీ హార్ట్ బీట్ ను ఉపయోగిస్తుంది. ఉపయోగిస్తుంది.
ECG ఆధారిత బయోమెట్రిక్ ఫీచర్
Apple iPhone, iPad, Mac తో సహా తన డివైజ్ ల కోసం ఇప్పుడు ECG (ఎలక్ట్రో కార్డియోగ్రామ్) బయోమెట్రిక్ ఫీచర్‌పై పని చేస్తున్నట్లు నివేదించింది. ఈ ఫీచర్ మీ హృదయ స్పందనలకు సంబంధించి ప్రత్యేక లయపై ఆధారపడి ఉంటుంది. మీ గుండె లయ సరిపోలినప్పుడు మీ పరికరం అన్‌లాక్ చేస్తుంది.
హార్ట్ బీట్ తో అన్‌లాక్
ప్రతి వ్యక్తి హృదయ స్పందన కూడా వేలిముద్ర లేదా బయోమెట్రిక్ సెన్సార్ మాదిరిగానే ప్రత్యేకంగా భిన్నంగా ఉంటుంది. Apple వాచ్‌లో ECG యాప్‌ని ఉపయోగించడం ద్వారా, Apple హృదయ స్పందనల లయను పర్యవేక్షించగలదు. దీనినే దానిని వినియోగదారు లాక్ \అన్ లాక్ ఫీచర్ గా ఉపయోగించవచ్చు. మీరు మీ Apple వాచ్‌ని మీ iPhone లేదా ఇతర Apple పరికరాలతో కనెక్ట్ చేసినప్పుడు ఈ కొత్త సాంకేతికత పని చేస్తుంది. Apple వాచ్ ధరించిన వినియోగదారులు ECG యాప్ ద్వారా వారి హృదయ స్పందనల రిథమ్‌ను ఉపయోగించి వారి పరికరాన్ని అన్‌లాక్ చేయగలరు.
మెరుగైన భద్రత:
ఈ కొత్త టెక్నాలజీ iPhone, iPad, Mac వినియోగదారులకు అదనపు భద్రతను అందిస్తుంది. ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్, పాస్‌వర్డ్‌తో పాటు, వినియోగదారులు వారి హార్ట్ బీట్ ఉపయోగించి వారి పరికరాలను కూడా అన్‌లాక్ చేయవచ్చు. అయితే, ఈ సాంకేతికత వాణిజ్యపరంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు.
ఇదిలా ఉండగా యాపిల్ తాజాగా ఇండియాలో తన ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. ఐఫోన్ 15, ఐఫోన్ 14తో సహా అనేక ఐఫోన్ మోడళ్లపై ధర తగ్గింపు అందుబాటులో ఉంది. ధర తగ్గింపు ఫలితంగా, కొన్ని ప్రముఖ ఐఫోన్ మోడల్‌లు రూ. 300 నుండి రూ. 6,000 వరకు ధరలు తగ్గాయి. మొబైల్ ఫోన్‌లు, మొబైల్ పిసిబిఎలు, మొబైల్ ఛార్జర్‌లపై భారత ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం నుండి 15 శాతానికి తగ్గించడంతో ఒక్కసారి ఆపిల్ తన స్మార్ట్ ఫోన్ల ధరలను కూడా తగ్గించింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..