AP Elections | ఏపీలో ఒంటరిగానే బీజేపీ పోటీ..!!
AP Elections | న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే చాన్స్ ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించేందుకు టీడీపీ – జనసేన పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.. ఈ రెండు పార్టీలో ఇటీవలే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల మొదటి జాబితాను కూడా విడుదల చేశాయి. అయితే భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ – జనసేనతో కలిసి పోటీ చేస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీడీపీ – జనసేన కూటమితో కలిసి వెళ్లకుండా బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలనే నిర్ణయించుకున్నట్లు ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో బీసీ సీఎం తరహా.. ఆంధ్రాలో కాపు సీఎం నినాదాన్ని ఎత్తుకుని, ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ పక్కా ప్లాన్ రచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ హైకమాండ్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టినట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీల్లో టికెట్లు దక్కని ఆశావహులపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ దక్కని వారు 30 నుంచి 40 మంది సీనియర్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..