Annamalai | తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే (DMK) ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ తాను చెప్పులు వేసుకోబోనని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా యూనివర్సిటీ(Anna University)లో లైంగిక దాడి కేసులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతీ శుక్రవారం తన ఇంటి ముందు ఆరు కొరడా దెబ్బలు తింటానని గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో బాధితురాలి పేరు, ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలు వెల్లడించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎఫ్ఐఆర్ లీక్ చేయడం ద్వారా బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశారని, ఇది బాధితురాలి పట్ల ప్రభుత్వం, పోలీసుల వైఖరి ఎంటో తేటతెల్లం చేస్తుందని తెలిపారు . ఎఫ్ఐఆర్ వివరాలను లీక్ చేసినందుకు పోలీసులు, డీఎంకే పార్టీ నేతలు సిగ్గు పడాలి. నిర్భయ నిధి ఎక్కడ?. అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎందుకు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయలేదు’ అని అన్నామలై (Annamalai) ప్రశ్నలవర్షం కురిపించారు.
ఇటువంటి మకిలి రాజకీయాలకు చరమ గీతం పాడతామని అన్నామలై అన్నారు. వచ్చే 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపడతామని వెల్లడించారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి మురుగన్ ను దర్శించుకుంటా. రాష్ట్రంలో పరిస్థితిపై మురుగన్‌కు ఫిర్యాదు చేస్తా’ అని ఆయన తెలిపారు. కాగా అన్నామలైపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎస్.రేగుపతి విమర్శలు చేశారు. అన్నామలై రాకతోనే రాష్ట్రంలో గందరగోళం నెలకొందని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..