Amit Shah On CAA | పార్సీలు, క్రైస్తవులు CAA కు అర్హులు.. ముస్లింలు ఎందుకు కాదు? క్లారిటీ ఇచ్చిన అమిత్ షా..

Amit Shah On CAA | పార్సీలు, క్రైస్తవులు CAA కు అర్హులు..  ముస్లింలు ఎందుకు కాదు?  క్లారిటీ ఇచ్చిన అమిత్ షా..

Citizenship Amendment Act : పాక్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ లో హింస‌కు గురువుతున్న ముస్లిమేత‌ర వ‌ర్గాల‌కు మాన‌వీయ కోణంలో భార‌త పౌర‌సత్వం క‌ల్పించేందుకు ఇటీవ‌ల‌ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను అమల్లోకి తెచ్చిన విష‌యం తెలిసిందే.. అయితే పై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ సహా తృణమూల్‌, సీపీఐ, ఆప్‌, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలు ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఏఏ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) స్పందించారు. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో హింస‌కు గురైన మైనారిటీలకు పౌరసత్వం అందించడం CAA లక్ష్యం. పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చుట్టూ అపోహ‌ల మ‌ధ్య హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం క్లారిటీ ఇచ్చారు.

వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సీఏఏ చట్టం ఎందుకు పార్సీలు, క్రైస్తవులు వ‌ర్తిస్తుంది?  ముస్లింల‌కు ఎందుకు వ‌ర్తించ‌ద‌ని అమిత్‌షాను అడిగారు. మతపరమైన హింసకు గురైన వారికి ఆశ్రయం కల్పించడం మన నైతిక, రాజ్యాంగ బాధ్యత అని తాను న‌మ్ముతున్న‌ట్లు అమిత్ షా పేర్కొన్నారు. అఖండ భారత్ అనేది ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మాల్దీవులు, నేపాల్, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంక టిబెట్‌లలో విస్తరించి ఉన్న ఐక్య గ్రేటర్ ఇండియా భావన.

READ MORE  TSRTC Electric Buses: త్వరలో అన్ని మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు : ఆర్టీసీ ఎండీ ఎండీ సజ్జనార్

విభజన సమయంలో పాకిస్థాన్ జనాభాలో హిందువులు 23 శాతం ఉన్నారని హోంమంత్రి చెప్పారు. ” కానీ అక్కడ ప్రస్తుతం వీరి జనాభా అతి దారుణంగా 3.7 శాతానికి పడిపోయింది. వీరంతా ఎక్కడికి వెళ్ళారు? ఇంత మంది మ‌న‌దేశానికి కూడా రాలేదు. పాక్ లో బలవంతపు మతమార్పిడి జరిగింది. వారిని అవమానించారు, ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు.  అత్యంత దారుణ ప‌రిస్థితుల‌ను అవ‌మానాలు, దాడులను ఎదుర్కొంటున్న వారు ఎక్కడికి వెళతారు? మన పార్లమెంటు, దీనిపై రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటాయా? అని అమిత్ షా ప్ర‌శ్నించారు.

READ MORE  ఆది శంకరాచార్య 108 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ..

ఇక 1951లో బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 22 శాతం ఉన్నారని ఆయన అన్నారు. “2011లో ఇది 10 శాతానికి ప‌డిపోయింద‌ని, వారు ఎక్కడికి వెళ్లారు? అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో “1992లో దాదాపు 2 లక్షల మంది సిక్కులు, హిందువులు ఉన్నారు. ఇప్పుడు కేవలం 500 మంది మాత్రమే మిగిలారు. ఆయా దేశాల్లో వారి (మత) విశ్వాసాల ప్రకారం హిందువులు, సిక్కులకు ఇతర మతస్తులకు జీవించే హక్కు వారికి లేదా? భారతదేశం ఒకటిగా ఉన్నప్పుడు, వారు మనవారు, వారు మన సోదరులు, సోదరీమణులు. తల్లులు, హోంమంత్రి అమిత్ షా చెప్పారు.

ఇతర వర్గాలు..

షియా, బలూచ్, అహ్మదీయ ముస్లింలు వంటి పీడించబడుతున్న వర్గాల గురించి అడిగిన ప్రశ్నకు, “ప్రపంచ వ్యాప్తంగా, ఈ కూటమిని ముస్లిం బ్లాక్‌గా పరిగణిస్తారు. అలాగే, ముస్లింలు కూడా ఇక్కడ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాజ్యాంగంలో ఒక నిబంధన ఉంది. వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ భద్రత , ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఎటువంటి చెల్లుబాటు అయ్యే పత్రం లేకుండా సరిహద్దు దాటిన మూడు దేశాల నుంచి హింసకు గురైన మైనారిటీల రక్షణ కోసమే ఈ CAA “ప్రత్యేక చట్టం” అని ఆయన అన్నారు. పత్రాలు లేని వారి గురించి ఏమిటని షా అడిగిన ప్రశ్నకు, “పత్రాలు లేని వారికి మేము పరిష్కారం కనుగొంటాము. కానీ నా అంచనా ప్రకారం, వారిలో 85 శాతానికి పైగా పత్రాలు ఉన్నాయి. అని పేర్కొన్నారు.

READ MORE  సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *