Amazon Great Republic Day Sale : అమెజాన్ ఇండియా తన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను జనవరి 13 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు జనవరి 12న ముందస్తు యాక్సెస్ ఉంటుంది. సేల్ ఈవెంట్ ఎప్పటివరకు కొనసాగుతుంతో ఇంకా వెల్లడి కానప్పటికీ, అమెజాన్ వివిధ కేటగిరీల్లో పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందజేస్తుందని పేర్కొంది. OnePlus Nord 4 వంటి మిడిల్ రేంజ్ ఫోన్ల నుంచి Samsung Galaxy S23 Ultra వంటి హై-ఎండ్ డివైజ్‌ల వరకు, కొనుగోలుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సేల్ ఈవెంట్‌లో అద్భుతమైన డీల్‌లను ఆశించవచ్చు.
స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు..
ఆమేజాన్లో ప్రదర్శిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు డిస్కౌంట్ సేల్ సందర్భంగా భారీ తగ్గింపులను ఉంటాయని అమెజాన్ వెల్లడించింది. అనేక డివైజ్‌లకు సంబంధించి ఖచ్చితమైన ధర వివరాలు ఇంకా అధికారికంగా లేవు. అయితే ఇక్కడ OnePlus 13, Samsung Galaxy S23 Ultra, Redmi A4, iPhone 15, iQOO Z9s, OnePlus Nord 4, Poco X6, Oppo F27 Pro+ వంటి కొన్ని మోడల్‌లు మంచి ఆఫర్‌లు లభిస్తాయి.
OnePlus ఫోన్లపై డిస్కౌంట్
OnePlus 13 రూ. 69,999కి లాంచ్ చేశారు. కానీ అమెజాన్ రిపబ్లిక్ డే సేల్స్ సమయంలో, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా కొనుగోళ్లపై రూ. 5,000 డిస్కౌంట్ ను అందిస్తోంది.
మరోవైపు, OnePlus 13R ధర రూ. 42,999 కాగా, రూ. 3,000 బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్‌తో వస్తుంది. సేల్ సమయంలో అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది.
iPhone 15 రూ. 60,000 లోపు?
Vijay Sales Republic Day Sale : అమెజాన్ టీజర్లు ఐఫోన్ 15 సేల్ ఈవెంట్‌లో రూ. 60,000 కంటే తక్కువ ధరకు లభిస్తాయని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం, ఈ డివైజ్ అమెజాన్ ఇండియా స్టోర్‌లో రూ. 60,499గా జాబితా చేయబడింది. డిస్కౌంట్ సేల్ ఈవెంట్ సమయంలో దీని ధర రూ. 60,000 లోపు లభించనుంది.
విజయ్ సేల్స్ లో ఐఫోన్‌పై ఆఫర్లు
మీరు ఇప్పటికీ తాజా iPhone మోడల్‌లపై బిగ్ డిస్కౌంట్ల కోసం చూస్తున్నట్లయితే, విజయ్ సేల్స్ కొన్ని ఆకట్టుకునే డీల్స్ అందిస్తోంది.
iPhone 16 (128GB) దాని ప్రారంభ ధర రూ. 79,900 నుండి రూ. 73,490 కు అందుబాటులో ఉంది.
అదేవిధంగా, iPhone 16 Pro రూ. 1,12,900 కు విక్రయిస్తున్నారు.ఇది రూ. 7,000 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. ఇక ఐఫోన్ 16 ప్లస్‌ను రూ.84,900కి కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ. 1,37,900 వద్ద అందుబాటులో ఉంది, దీని ప్రారంభ ధర రూ. 1,49,900 నుండి గణనీయమైన తగ్గింపు ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..