Amazfit కంపెనీ Cheetah, Cheetah Pro అనే సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను ప్రారంభించింది. ఇది AI- పవర్డ్ జెప్ కోచ్‌తో అమర్చబడి ఉంటాయి. .
వాచ్‌లో ఖచ్చితమైన నావిగేషన్, ఆఫ్‌లైన్ మ్యాప్‌లు కూడా ఉన్నాయి. వినియోగదారులు లొకేషన్ పాయింట్‌లను కూడా సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. Amazfit
స్మార్ట్‌వాచ్‌లు రెండూ మల్టీస్పోర్ట్ ఫోకస్‌తో రూపొందించబడ్డాయి. అవి డ్యూయల్-బ్యాండ్ సర్క్యులర్-పోలరైజ్డ్ GPS యాంటెన్నాతో వస్తాయి. ఇది 99.5 శాతం ఖచ్చితమైన
లొకేషన్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Amazfit Cheetah, Cheetah Pro ధర
అమాజ్‌ఫిట్ చీతా ధర $229.99 (దాదాపు రూ. 18,700)గా నిర్ణయించారు.. ఇది ఏకైక స్పీడ్‌స్టర్ గ్రే కలర్ షేడ్‌లో లభిస్తుంది. మరోవైపు, Amazfit Cheetah Pro
ధర $299.99 (దాదాపు రూ. 24512). రెండు స్మార్ట్‌వాచ్‌లు Amazfit స్టోర్‌లు , Amazon, AliExpress లో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.
Amazfit Cheetah ఫీచర్లు
Amazfit Cheetah 1.39-అంగుళాల (454×454 పిక్సెల్‌లు) HD AMOLED డిస్‌ప్లేతో టెంపర్డ్ గ్లాస్, యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌ను కలిగి ఉంది. ఇది 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. కొత్త Amazfit స్మార్ట్ వాచ్ రియల్ టైమ్ GPS ట్రాకింగ్, రూట్ నావిగేషన్ కోసం డ్యూయల్-బ్యాండ్ GPS టెక్నాలజీని కలిగి ఉంది. రూట్ ఫైల్‌లను డౌన్లోడ్ చేసుకోవడానికి వాటిని నావిగేట్ చేయడానికి కూడా వాచ్ వినియోగదారులను అనుమతిస్తుంది.
అమేజ్‌ఫిట్ చీటా రన్నింగ్, వాకింగ్ స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్, డ్యాన్స్, ఇతర స్పోర్ట్స్ తో సహా 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఇది బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రేట్, ఒత్తిడి స్థాయిలను నిరంతరం పర్యవేక్షించే బయోట్రాకర్ PPG బయోమెట్రిక్ ఆప్టికల్ సెన్సార్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది స్లీప్ మానిటైజేషన్ వంటి హెల్త్ రిమైండర్లకు మద్దతు ఇస్తుంది. Amazfit Cheetah 440mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఎక్కువ వినియోగిస్తే 7 రోజుల వరకు, సాధారణ ఉపయోగంతో 14 రోజుల వరకు.. బ్యాటరీ
సేవర్ మోడ్ ఆన్‌లో ఉంటే 45 రోజుల వరకు ఉంటుంది.
అమాజ్‌ఫిట్ చీటా ప్రో స్పెసిఫికేషన్‌లు
Amazfit Cheetah Pro టైటానియం అల్లాయ్ బెజెల్, నైలాన్ స్ట్రాప్‌తో 1.45-అంగుళాల HD AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 150 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌ల కలిగి ఉంటుంది. బయోట్రాకర్ PPG బయోమెట్రిక్ ఆప్టికల్ సెన్సార్‌తో కూడిన స్మార్ట్ హెల్త్ మానిటర్లు, బ్లూటూత్ కాలింగ్, మ్యూజిక్ స్టోరేజ్ వంటి ఇతర ఫీచర్లు Amazfit Cheetah స్టాండర్డ్ వేరియంట్‌తో సమానంగా ఉంటాయి. Amazfit Cheetah Pro కూడా 440mAh బ్యాటరీతో వస్తుంది.