Wednesday, December 18Thank you for visiting
Shadow

Allu Arjun | అల్లు అర్జున్ అరెస్టు.. అస‌లేం జరిగింది?

Spread the love

Allu Arjun : పుష్ప-2 సినిమా చూడ్డానికి వ‌చ్చి తొక్కిస‌లాట‌లో ఓ మ‌హిళ మృతి చెందిన కేసులో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ శుక్ర‌వారం అరెస్టు అయ్యారు. చిక్కడపల్లి పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే ముగ్గురిని అరెస్టు కాగా అల్లు అర్జున్‌ను కూడా కావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావ‌త్ భార‌తదేశంలో ఉన్న ఆయ‌న ఫ్యాన్స్ షాక్‌కు గుర‌య్యారు. స‌రైన ఏర్పాట్లు లేక‌పోవ‌డం వ‌ల్లే ఆ మ‌హిళ మృతి చెంద‌ని సంధ్యా థియేట‌ర్ య‌జ‌మానితోపాటు మేనేజర్‌ను, సరైన భద్రతా చర్యలు చేపట్టలేద‌ని సెక్యూరిటీ మేనేజర్‌ను ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేసిన‌ చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు. తాజాగా హీరో అల్లు అర్జున్‌ను కూడా అరెస్టు చేయ‌డం, ఆయన్ను సెంట్ర‌ల్ జైలుకు పంప‌డం సంచ‌న‌లం సృష్టించింది.

పోలీసులు ఏమన్నారు?

సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు చేప‌ట్టిన విచార‌ణ‌లో ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెలుగుచూశాయి. రాత్రి 9.40 గంటల సమయంలో పుష్ప 2 ప్రీ రిలీజ్‌ షో ఇక్క‌డ ఏర్పాటు చేశార‌ని, దీనికి ప్రేక్ష‌కులు పోటెత్త‌డంతో కీల‌క న‌టీన‌టులు హాజ‌ర‌వుతార‌ని త‌మ‌కు ముంద‌స్తు స‌మాచారం లేద‌ని డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. ఈ విష‌యంలో థియేట‌ర్ యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హిరించింద‌ని, త‌మ‌కు ముంద‌స్తు స‌మాచారం ఇవ్వలేద‌ని అన్నారు. పోటెత్తిన ప్రేక్ష‌కుల‌ను కంట్రోల్ చేయ‌డానికి థియేట‌ర్‌లో ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించ‌లేద‌ని, ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఓ మ‌హిళ ప్రాణాలు కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని అన్నారు.

READ MORE  Vikrant Massey | విక్రాంత్ మాస్సే.. 37 ఏళ్ళ వయసులో నటనకు రిటైర్మెంట్, అభిమానులను షాక్‌..

వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది ఓవ‌రాక్ష‌న్‌!

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చిన న‌టులు ఎలాంటి ప్రత్యేక జాగ్ర‌త్త‌లు పాటించలేద‌ని పోలీసులు అంటున్నారు. అల్లు అర్జున్ త‌న వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బందితో సంధ్యా థియేట‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని, ఆయ‌న లోపలికి వెళ్లిన సమయంలో ప్రేక్షకులను భద్రతా సిబ్బంది నెట్టి వేశార‌ని తెలిపారు. దీంతో అప్పటికే థియేటర్ కిక్కిరిసిపోయి ఉందని, అదే సమయంలో కొంతమందితో అల్లు అర్జున్‌తోపాటే లోపలికి వెళ్లార‌ని, దీంతో ప్రేక్షకుల మధ్య తోపులాట జ‌రిగింద‌ని వివ‌రిస్తున్నారు.

READ MORE  Netflix Moments | నెట్‌ఫ్లిక్స్ లో అదిరిపోయే అప్‌డేట్‌.. కొత్తగా 'మూమెంట్స్ ఫీచ‌ర్ తో ఏం చేయొచ్చంటే..

Allu Arjunను చూడ్డానికి వ‌చ్చి..

దిల్‌సుక్‌నగర్‌కు చెందిన రేవతి (39) త‌న 13 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్‌తో క‌లిసి పుష్ప‌-2 ప్రీ రిలీజ్‌ షోను చూడ్డానికి సంధ్యా థియేట‌ర్‌కు వ‌చ్చింది. అదే స‌మ‌యంలో హీరో అల్లు అర్జున్ స‌హా కీల‌క న‌టీన‌టులు అక్క‌డికి వ‌చ్చారు. ఇది ముందే తెలుసుకున్న ప్రేక్షకులు భారీ సంఖ్య‌లో అక్క‌డికి వ‌చ్చారు. క్రౌడ్ బాగా పెరిగి తొక్కిస‌లాట జ‌రిగింది. రేవ‌తి, ఆమె కుమారుడికి ఊపిరి ఆడ‌క ఇద్ద‌రూ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అక్క‌డే ఉన్న పోలీసులు శ్రీతేజ్‌కు సీపీఆర్ చేశారు. రేవ‌తి ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌టంతో ఇద్ద‌రినీ దుర్గాబాయి దేశముఖ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్పటికే రేవ‌తి మృతి చెందింది. శ్రీ తేజను మరో ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల‌ని వైద్యులు సూచించారు.

ఫిర్యాదులు.. కేసులు

ఈ ఘటనపై రేవ‌తి కుటుంబ స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆమె మృతికి కార‌కులైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలని చిక్క‌డ‌ప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇదే క్ర‌మంలో న్యాయవాది ఇమ్మినేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ)కు ఈ ఘ‌ట‌న‌పైఐ ఫిర్యాదు చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సంధ్యా థియేట‌ర్ యాజ‌మాన్యం నిర్వ‌హించింద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసుల నిర్ల‌క్ష్యం కూడా ఉంద‌ని ఆయ‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ర‌ద్దీని అంచ‌నా వేసే అవ‌కాశం ఉన్న ఆ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని ఆరోపించారు. పైగా ర‌ద్దీని కంట్రోల్ చేయ‌డానికి లాఠీ చార్జ్ చేశార‌ని, దీంతో మ‌హిళ మృతి చెందింద‌ని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల నేప‌థ్యంలో కేసులు న‌మోదై అల్లు అర్జున్ స‌హా మ‌రికొందరు అరెస్ట‌య్యారు.

READ MORE  Model Schools | మోడల్‌ స్కూల్స్‌లో 2,757 మంది టీచర్లకు బ‌దిలీలు

మధ్యంతర బెయిల్

అల్లు అర్జున్‌ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారించింది. అనంతరం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *