Ajit Doval | జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ మూడవసారి నియామకం
NSA Ajit Doval | జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్(Ajit Doval) మరోసారి నియమితులయ్యారు. మూడో సారి ఆయన ఆ పదవిని చేపట్టనున్నారు. ఇక ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా డాక్టర్ పీకే మిశ్రాను నియమించారు. ఈనెల 10 నుంచి నియామకాలు అమలులోకి రానున్నట్లు అపాయింట్స్ కమిటీ తెలిపింది. పదవీకాలం సమయంలో పీకే మిశ్రాకు క్యాబినెట్ మంత్రి హోదా ర్యాంక్ ఇవ్వనున్నారు. ప్రధాని మోదీకి సలహాదారులుగా అమిత్ ఖేర్, తరుణ్ కపూర్‌లను నియమించారు. డాక్టర్ మిశ్రా PMOలో పరిపాలనా వ్యవహారాలు, నియామకాలను నిర్వహిస్తుండగా, దోవల్ జాతీయ భద్రత, సైనిక వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ బాధ్యతలను నిర్వహిస్తారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ అజిత్ దోవల్ (Doval) ప్రధానమంత్రికి అత్యంత విశ్వసనీయ సహాయకులలో ఒకరు. 2014 నుంచి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. కేరళ కేడర్‌కు చెందిన 1968-బ్యాచ్ IPS అధికారి, మొదటి పోలీసు. కీర్తి చక్ర కూడా అయనను వరించింది. ఇది అశోక్ చక్ర తర్వాత రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం. అన్ని ఉగ్రవాద వ్యతిరేక, గూఢచార సంస్థలు కలిగిన జాతీయ భద్రతా మండలికి అజిత్ దోవల్ బాధ్యత వహిస్తారు. ఆయన దేశంలోని అత్యంత శక్తివంతమైన అధికారులలో ఒకరిగా ఉన్నారు. ఇక డాక్టర్ పికె మిశ్రా 1972 బ్యాచ్‌కి చెందిన రిటైర్డ్ అధికారి, ఆయన GOI కి వ్యవసాయ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత గత దశాబ్ద కాలంగా PM మోదీతో ఉన్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..