Airtel Recharge Plans | ఉచితంగా ఓటీటీలు కావాలా? అయితే ఈ రీచార్జి ప్లాన్ మీ కోసమే..
Airtel Recharge Plans | Airtel, Jio, Vodafone Idea, BSNL వంటి అన్ని ప్రధాన టెలికాం కంపెనీలు.. తమ రీఛార్జ్ ప్లాన్‌లలో భాగంగా కాంప్లిమెంటరీ OTT సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంటాయి. ఈ రీఛార్జ్ ప్లాన్‌లతో ఓటీటీలు కూాడా వస్తుండడంతో వినియోగదారుల మొబైల్ ఫోన్లు పోర్టబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌లుగా మారిపోతుంటాయి. ప్రయాణంలో వారికి ఇష్టమైన కంటెంట్‌ను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తాయి. అదనంగా, ఎంటర్ టైన్ మెంట్ తోపాటు వినియోగదారులు అపరిమిత కాలింగ్, డేటా నుండి ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు, Airtel అందిస్తున్న ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన 84-రోజుల రీఛార్జ్ ప్లాన్ బాగా ప్రజాదరణ పొందింది.
ఎయిర్‌టెల్ రూ. 979 రీఛార్జ్ ప్లాన్
Airtel Recharge Plans : ఎయిర్ టెల్ రూ. 979 రీఛార్జ్ ప్లాన్‌లో Airtel Xstream Play సర్వీస్ కూడా అందుతుంది. ఇందులోది Sony LIV, Lionsgate Play, Aha, Chaupal, Hoichoi, SunNxt వంటి అనేక రకాల యాప్‌లలోని కంటెంట్ ను వినియోగదారులకు వీక్షించవచ్చు యాప్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు, వినియోగదారులు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్, రోజువారీ 2GB డేటా అలవెన్స్ (మొత్తం 168GB), ఉచిత జాతీయ రోమింగ్, 100 ఉచిత రోజువారీ SMSలను పొందుతారు. ఇంకా, 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్న వినియోగదారులు అపరిమిత 5G డేటాను యాక్సెస్ చేయవచ్చు.
వొడఫోన్ ఐడియాలోనూ ఇదే తరహా ప్లాన్..
అయితే Vodafone Idea ఇదే విధమైన 84-రోజుల ప్లాన్‌ను రూ. 998కి అందిస్తుంది. వినియోగదారులకు ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్, రోజువారీ 100 ఉచిత SMS, 2GB డేటాను అందిస్తుంది. అదనంగా, Vi సబ్‌స్క్రైబర్‌లు వారాంతపు డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్, రాత్రంతా బింగే వంటి ప్రయోజనాలతో పాటు Sony LIV OTT యాప్‌కు 84-రోజుల సభ్యత్వాన్ని అందుకుంటారు.
ఇదిలా ఉండగా భారతీ ఎయిర్‌టెల్ తన Wynk మ్యూజిక్ యాప్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా మ్యూజిక్ వర్టికల్ నుంచి నిష్క్రమించడాన్ని ధృవీకరించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. టెలికాం దిగ్గజం వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ కోసం Appleతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వెల్లడించింది. ఇది రాబోయే నెలల్లో Wynk మ్యూజిక్ యాప్‌ను మూసివేయనుంది. ఇంకా, ఎయిర్‌టెల్ వింక్ మ్యూజిక్ ఉద్యోగులందరినీ ఎయిర్ టెల్ కంపెనీలో విలీనం చేస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..