Saturday, August 30Thank you for visiting

Airtel festive Season Offer | ఈ కొత్త రీచార్జ్ ప్లాన్లతో అదనపు డేటా, OTT ప్రయోజనాలు.. డిస్నీ హాట్ స్టార్ కూడా..

Spread the love

Airtel festive Season Offer  | ఎయిర్‌టెల్ దేశంలోని రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉంది. దీని హై-స్పీడ్ డేటా కనెక్టివిటీ మెరుగైన స‌ర్వీస్ తో 39 కోట్ల మంది వినియోగదారులకు త‌ర‌చూ ఆక‌ర్ష‌నీయ‌మైన రీచార్జ్ ప్లాన్లను తీసుకొస్తుంది. కాగా పండుగ సీజన్ సంద‌ర్భంగా ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. మూడు రీఛార్జ్ ప్లాన్‌లతో వివిధ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ పండుగ ఆఫర్ రిలయన్స్ జియోతో పాటు Vodafone Idea, BSNL తో పోటీ ప‌డుతోంది.

Airtel ఫెస్టివ్ ఆఫర్ ప్రత్యేకంగా సెప్టెంబర్ 11 వరకు అందుబాటులో ఉంటుంది. రూ. 979, రూ. 1029, రూ. 3599 రీఛార్జ్ ప్లాన్‌ల వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎయిర్‌టెల్ రూ. 979 రీఛార్జ్ ప్లాన్

రూ. 979 రీచార్జి ప్లాన్ లో కస్టమర్‌లు 84 రోజుల వాలిడిటీ, ప్రతిరోజూ 100 ఉచిత SMS, 84 రోజుల పాటు ఏదైనా నెట్‌వర్క్‌కి అపరిమిత ఉచిత కాలింగ్, 84 రోజుల పాటు 168 GB డేటా (రోజుకు 2GB డేటాకు సమానం) అందుకుంటారు. ఇక‌ పండుగ ఆఫర్‌లో భాగంగా, వినియోగదారులు ఈ ప్లాన్‌లో 28 రోజుల పాటు అదనంగా 10 GB డేటాను పొంద‌వ‌చ్చు. అలాగే Xstream ప్రీమియంతో పాటు 22 కంటే ఎక్కువ OTT సబ్‌స్క్రిప్షన్‌లకు యాక్సెస్ పొందుతారు.

ఎయిర్‌టెల్ రూ. 1029 రీఛార్జ్ ప్లాన్

రూ. 1029 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. రోజువారీ 2GB డేటా, 84 రోజుల పాటు అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తుంది, అలాగే ఇదే వాలిడిటీలో Disney Plus Hotstar కి సబ్‌స్క్రిప్షన్ పొంద‌వ‌చ్చు. Airtel festive Season Offer ద్వారా, కస్టమర్‌లు 28 రోజుల పాటు అదనంగా 10 GB డేటాను అందుకుంటారు. Xstream ప్రీమియంతో పాటు 22 కంటే ఎక్కువ OTT సబ్‌స్క్రిప్షన్‌లకు యాక్సెస్ పొందుతారు.

Airtel రూ. 3599 రీఛార్జ్ ప్లాన్

చివరగా, రూ. 3599 ప్లాన్ అనేది 365 రోజుల చెల్లుబాటుతో కూడిన వార్షిక ప్లాన్. 365 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్, ప్రతిరోజూ 2GB డేటా. పండుగ ఆఫర్‌లో భాగంగా, కస్టమర్‌లు 28 రోజుల పాటు 10 GB అదనపు డేటాతో పాటు 28 రోజుల పాటు Xstream ప్రీమియంతో పాటు 22 కంటే ఎక్కువ OTT సబ్‌స్క్రిప్షన్‌లకు యాక్సెస్ పొందుతారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *