Saturday, April 19Welcome to Vandebhaarath

Adani group | ఒకవైపు అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు.. మరోవైపు తెలంగాణలో అదానీ గ్రూప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు..

Spread the love

Adani group | న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ(Goutham Adani)  పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పిలుపునివ్వడంతో తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని ఇరకాటంలో పడేట్లు అయింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలపై USలో అభియోగాలు మోపబడిన తర్వాత అతనిపై చర్య తీసుకోవాలని గాంధీ డిమాండ్‌ చేసిన విష‌యం తెలిసిందే.. అయితే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అదానీ గ్రూప్ నుంచి విరాళాలు స్వీకరించిన వార్త‌లు అదానీ గ్రూప్ తో తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌కు సంబంధించిన వార్త‌లు ట్రెండింగ్ లోకి వ‌చ్చాయి.

రాహుల్ గాంధీ ఏం చెప్పారు?

భారతీయ అధికారులకు USD 250 మిలియన్ల లంచం ఇచ్చినందుకు US ప్రాసిక్యూటర్లు అదానీ, ఆయ‌న‌ సహచరులపై అభియోగాలు మోపిన విష‌యంపై రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ప్ర‌స్తావించారు. గౌత‌మ్ అదానీ.. భారత్‌, అమెరికన్ చట్టాలను ఉల్లంఘించార‌ని, ఆయ‌న‌పై చ‌ర్య తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. అదానీని తక్షణమే అరెస్టు చేసి విచారించాలని, అతని “ప్రొటెక్టర్” మరియు SEBI చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్‌ను ఆమె పదవి నుండి తొలగించి విచారణ ప్రారంభించాలని ఆయన అన్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని రాహుల్‌ గాంధీ తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా ఉన్నాయని, ఈ అంశాన్ని ఉమ్మడిగా లేవనెత్తుతామని తెలిపారు. అయితే అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించింది, US ప్రాసిక్యూటర్ల ఆరోపణలు నిరాధారమైనవని, త‌మ ఒప్పందాల‌న్నీ చట్టాలకు అనుగుణంగా ఉన్నాయ‌ని పేర్కొంది. అన్ని

READ MORE  Mathura | మధుర, బృందావన్‌లోని ప్ర‌సాదాల‌పై అల‌ర్ట్‌.. నమూనాలను ల్యాబ్ కు త‌ర‌లింపు

రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఒప్పందాలు..

అక్టోబర్ 19న, గౌతమ్ అదానీ తెలంగాణ ముఖ్యమంత్రి (Revanth Reddy) ని కలిశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీకి ₹100 కోట్లు విరాళంగా ఇచ్చారు. నవంబర్ 9న మహారాష్ట్రలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అదానీ గ్రూప్ పెట్టుబడులు, విరాళాలను బహిరంగంగా స్వాగతించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ స్థాపనకు రూ.100 కోట్ల విరాళం చెక్కును అందజేసేందుకు అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం పోస్ట్ చేసింది. రాష్ట్ర యువ సాధికారత కార్యక్రమాలకు అదానీ నిరంతర మద్దతును తెలియజేసినట్లు సీఎం కార్యాలయం పేర్కొంది.

READ MORE  Congress Jana Jathara | మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ

ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అదానీ గ్రూప్ వివిధ రంగాల్లో ₹12,400 కోట్ల పెట్టుబడులు పెట్టి తెలంగాణ ప్రభుత్వంతో 4 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ₹5,000 కోట్లతో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను నిర్మించ‌నున్నారు.

అదానీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, రేవంత్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేత‌లు అదానీ గ్రూప్‌తో చురుకుగా వ్యవహరిస్తూ, కోట్లాది ఒప్పందాలు కుదుర్చుకున్నారు విరాళాలు తీసుకుంటున్నారు. ఒక‌వైపు విరాళాలు తీసుకోవ‌డం, ఒప్పందాలు కుదుర్చుకోవ‌డం మ‌రోవైపు రాహుల్ మ‌ళ్లీ అదానిపై విమ‌ర్శ‌లు చేయ‌డం.. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖ‌రిని తేట‌తెల్లం చేస్తోంది. కాంగ్రెస్ నాయకత్వం నిజంగా అదానీని జవాబుదారీగా చేయాల‌ని అనుకుంటే.. మ‌రి అదే పార్టీ రాష్ట్ర స్థాయిలో అదానీతోనే ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు? అని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.

READ MORE  వందే భారత్ స్లీపర్ రైలు 2025లో వ‌స్తోంది.. కొత్త రైలు రూట్, టికెట్ ఛార్జీలు, కొత్త ఫీచర్లు ఇవే..

ఆరోపణలను ఖండించిన Adani group

సోలార్ పవర్ కాంట్రాక్ట్‌ల కోసం త‌మ‌కు అనుకూలమైన నిబంధనలను పొందేందుకు లంచం చెల్లించారనే ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది, US ప్రాసిక్యూటర్ల ఆరోపణలు నిరాధారమైనవని, ఒప్పందాల‌న్నీ చట్టాలకు అనుగుణంగా ఉన్నాయిని పేర్కొంది. మా వాటాదారులు, భాగస్వాములు ఉద్యోగులకు మేము చట్టాన్ని గౌరవించే సంస్థ అని, అన్ని చట్టాలకు పూర్తిగా కట్టుబడి ఉంటామని హామీ ఇస్తున్నామని కంపెనీ పేర్కొంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *