Acer Iconia Tablets | తైవానీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Acer భారతదేశంలో 8.7-అంగుళాల Iconia Tab iM9-12M, 10.36-అంగుళాల Iconia Tab iM10-22 ఫీచర్లతో Iconia Tab Android టాబ్లెట్‌లను విడుదల చేసింది. వీడియో ప్లేబ్యాక్ కోసం గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ ను ఇస్తుందని Acer పేర్కొంది. అదనంగా, రెండు మోడళ్లలో కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్ 4G LTE సపోర్ట్ ఇస్తుంది.
Acer Iconia Tab iM: ధర, లభ్యత
Acer Iconia Tab iM9-12M (8.7-అంగుళాల): రూ 11,990 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే Acer Iconia Tab iM10-22 (10.36-అంగుళాల): రూ 14,990 నుంచి మొదలవుతుంది. Acer Iconia Tabs కొత్త సిరీస్ ఇప్పుడు భారతదేశంలో Acer ప్రత్యేక స్టోర్స్, Acer ఆన్‌లైన్ స్టోర్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.
Acer Iconia Tab iM: స్పెసిఫికేషన్స్
8.7-అంగుళాల Acer Iconia Tab iM9-12M MediaTek Helio P22T చిప్‌తో పనిచేస్తుంది. 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. ఇది 1340 x 800 రిజల్యూషన్‌తో డిస్‌ప్లేను కలిగి ఉంది. 30Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇమేజింగ్ కోసం, iM9-12M 8MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
ఇక 10.36-అంగుళాల Iconia Tab iM10-22 ప్యూర్‌వాయిస్ క్వాడ్ స్పీకర్ సిస్టమ్‌తో 2K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Helio G99 ద్వారా పనిచేస్తుంది.ఇది 6GB RAM, 128GB నిల్వతో పాటు 16MP వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
Iconia iM9-12M మరియు iM10-22 రెండూ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతాయి. కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్ 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi , బ్లూటూత్ 5.2కి మద్దతు ఇస్తాయి.