Aadhaar Free Update : ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ గడువును మిస్ చేయవద్దు. సెప్టెంబర్ 14లోగా దరఖాస్తు చేసుకోండి
Aadhaar Free Update : దేశంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ ఆధార్ గుర్తింపు తప్పనిసరి ఏ పథకానికైనా లేదా ఎక్కడి వెళ్లినా ఆధార్ ప్రూఫ్ సమర్పించాల్సిందే.. అయితే అందరూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, ప్రభుత్వం సెప్టెంబర్ 14, 2024 వరకు ఉచిత అప్‌డేట్ సర్వీస్ ను అందిస్తోంది. గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఈ గడువు ఇప్పటికే అనేకసార్లు పొడిగించబడినప్పటికీ, తదుపరి పొడిగింపులపై ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం, వ్యక్తులు తమ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి ప్రతీ పది సంవత్సరాలకు వారి POI మరియు POA పత్రాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. ఈ అప్ డేట్ 5, 15 సంవత్సరాల వయస్సులో వారి బ్లూ ఆధార్ కార్డ్‌పై పిల్లల బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి కూడా వర్తిస్తుంది.
ముఖ్యంగా, మీరు ఉచితంగా ఆన్‌లైన్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ/వయస్సు, లింగం, మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా, వివరాలను నవీకరించవచ్చు. ఆదాయపు పన్నులు దాఖలు చేయడం నుంచి విద్యాసంస్థల్లో నమోదు చేసుకోవడం వరకు.. ప్రయాణాల సమయాల్లో కూడా కూడా ఆధార్ అనేది ఇప్పుడు వివిధ సేవలకు ఉపయోగించే కీలకమైన గుర్తింపు కార్డుగా ఉంది. ఆధార్ డేటాబేస్ ఖచ్చితత్వం ప్రామాణికతను నిర్ధారించడానికి రెగ్యులర్ అప్‌డేట్‌లు అవసరం.
మీ ఆధార్ వివరాలను అప్ డేట్ గా ఉంచడం వల్ల ప్రభుత్వ సేవలను పొందడంతోపాటు మోసాలను కూడా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి, అవసరమైన సేవలను యాక్సెస్ చేయడంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
ఆధార్ కార్డ్ వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలి
Step-by-Step guide to updating Aadhaar online
- అధికారిక UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
- మీ ప్రొఫైల్‌లో మీ గుర్తింపు, చిరునామా వివరాలను సమీక్షించండి.
- నవీకరణ అవసరమైతే, డ్రాప్-డౌన్ మెను నుంచి తగిన డాక్యుమెంట్ టైప్ ను ఎంచుకోండి.
- JPEG, PNG లేదా PDF ఫార్మాట్‌లో ఒరిజినల్ సర్టిఫికెట్ స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి (ఫైల్ పరిమాణం 2 MB కంటే తక్కువగా ఉండాలి).
- మీ అప్ డేట్ రిక్కెస్ట్ ను సమర్పించండి.
చిరునామా వివరాలను అప్‌డేట్ చేయడానికి ఆన్‌లైన్ ప్రక్రియ మనకు అందుబాటులో ఉంది, అయితే బయోమెట్రిక్ సమాచారం, పేరు, మొబైల్ నంబర్ లేదా ఫోటోగ్రాఫ్‌లో మార్పుల కోసం, మీరు UIDAI-అధీకృత కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఉచిత అప్‌డేట్ సేవ సెప్టెంబర్ 14, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ తర్వాత, అప్‌డేట్‌ల కోసం ప్రామాణిక రుసుము రూ.50 ఛార్జీ విధించనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..