పారిపోయిన వధువు కోసం వరుల వేట

పారిపోయిన వధువు కోసం వరుల వేట

దాదాపు 27 మందిని వివాహం చేసుకున్న కిలేడీ
డబ్బు, బంగారంతో పరారీ

జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ మహిళ 27 మందిని పెళ్లి చేసుకొని వారి వద్ద నుంచి  బంగారం, డబ్బు దోచుకుని పారిపోయిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శ్రీనగర్ లాల్ చౌక్ ప్రెస్ కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు అవ్రత్ అనే మహిళ తమను వివాహం చేసుకుందని, ఆపై తమతో కొంతకాలం గడిపిన తర్వాత బంగారం, డబ్బుతో
పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన బుద్గామ్ జిల్లాలో జరిగింది. .

శ్రీనగర్ లాల్‌చౌక్‌లోని సితిత్ ప్రెస్ కాలనీలో కొందరు బాధితుల కథనం ప్రకారం.. జమ్మూ డివిజన్‌లోని రాజౌరి ప్రాంతానికి చెందిన మహిళ కొందరు మారేజ్ బ్రోకర్స్ తో కలిసి ముఠాగా ఏర్ప్డడ్డారు. సాధారణంగా ధనవంతులు లేదా పెద్ద మోత్తంలో కట్నాలు ఇచ్చేవారిని టార్గెట్ చేశారు. బద్గామ్ ఖాన్ సాహెబ్‌ ప్రాంతానికి చెందిన బాధితుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని నెలల క్రితం ఒక మ్యాచ్ మేకర్ తన వద్దకు చాలాసార్లు వచ్చి రాజౌరికి చెందిన ఒక మహిళ ఫోటోను చూపించాడు. సదరు మహిళను తన కొడుక్కు ఇచ్చి పెళ్లి చేయాలని ప్రలోభపెట్టాడని తెలిపింది. తన కొడుకుకు మహిళతో పెళ్లి చేస్తానన్న నెపంతో రెండు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పేర్కొంది.

READ MORE  l&t Metro Hyderabad | హైదరాబాద్ మెట్రోలో అసలేం జరుగుతోంది..!

మరో బాధితుడి ప్రకారం.. మ్యాచ్ మేకర్ ఈ రాజౌరి స్థానిక మహిళ ఫోటోను చూపించాడు. పెళ్లి అయిన కొన్ని రోజుల తరువాత, మహిళ అనారోగ్య సమస్యలతో తన భర్తతో కలిసి వైద్యుడి సంప్రదించడానికి ఆసుపత్రికి వెళ్లింది, ఆమె భర్త ఆసుపత్రి కౌంటర్‌లో  అడ్మిషన్ తీసుకుంటుండగా మహిళ ఆసుపత్రి నుండి పారిపోయింది.

మహిళ, ఆమె సహచరులు అందరూ తప్పుడు చిరునామాలు ఇచ్చారని, ఫేక్ ఐడీలు చూపించారని మహ్మద్ అల్తాఫ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి, కొంతమంది వ్యక్తులు
బుద్గామ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయగా సెక్షన్ 420, 120 బి కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

READ MORE  Israel – Palestine Conflict | ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య

అయితే బుద్గామ్‌లో ఈ మహిళ చేతిలో మోసపోయినవారు సుమారుగా 27 మంది ఉన్నారు. అందరూ చెబుతున్న కథనాలు ఒకే విధంగా ఉన్నాయి. ఆ మహిళ తన వివాహ
సమయంలో చూపించిన పత్రాలు, గుర్తింపు కార్డులలో జహీన్, ఇలియాసా, షాహినా అనే పేర్లను ఉపయోగించింది.. అయితే ఆమె అసలు పేరు ఇంకా తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *