
Zakir Hussain : ప్రఖ్యాత తబ్లా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మరణవార్త యావత్ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన అభిమానులను తీవ్రంగా కలచివేసింది. సోషల్ మీడియాను ఈ వార్తలు ఆదివారం రాత్రి కుదిపేశాయి. వీటి ఆధారంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా జాకీర్ హుస్సేన్ మరణ వార్తను ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఇదే క్రమంలో ఆయన మేనల్లుడు అమీర్ అవ్లియా స్పందించారు. Zakir Hussain Passed away
బతికే ఉన్నారని..
జాకీర్ హుస్సేన్ మరణించారనే వార్తలను అమీర్ ఖండించారు. ఈ తప్పుడు సమాచారాన్నినిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ‘మా మామ జాకీర్ హుస్సేన్ ఇంకా బతికే ఉన్నారు’ అని అమీర్ X హ్యాండిల్ ద్వారా తెలిపారు. ‘మీడియా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదు. దీన్ని ఆపేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రపంచంలోని ఆయన అభిమానులందరికీ ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయమని అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొన్నారు. హుస్సేన్ సోదరి ఖుర్షీద్ మాట్లాడుతూ ‘నా సోదరుడు ఇప్పుడు ఈ సమయంలో చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు. ఆయన కోసం ప్రార్థించండి’ అని అభిమానులను కోరారు.
పర్సనల్ సెక్రటరీ ప్రకటన
అమెరికాలో నివసిస్తున్న జాకీర్ హుస్సేన్ రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారని ఆయన మేనేజర్ నిర్మల బచ్చాని తెలిపారు. ‘గుండె సంబంధిత వ్యాధితో జాకీర్ సంఫ్రాన్సిస్కో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు’ అని వెల్లడించారు.
చివరికి కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
జాకీర్ హుస్సేన్ (73) బతికే ఉన్నారని చెబుతూ వచ్చిన కుటుంబ సభ్యులు ఎట్టకేలకు ఆయన మరణ వార్తను ధ్రువీకరించారు. ఐడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ కారణంగా ఆయన సంఫ్రాన్సిస్కో ఆస్పత్రిలో కన్నుమూశారని సోమవారం వెల్లడించారు. ‘ఆయన సంగీత అభిమానుల కోసం మిగిల్చిన అపార వారసత్వం పతాక స్థాయిలో ఉంటుంది. ఈ ప్రభావం తరతరాలకు ప్రతిధ్వనిస్తుంది’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సినీ ప్రముఖుల సంతాపం
జాకీర్ హుస్సేన్ మరణంపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, అక్షయ్‌కుమార్, ఏఆర్ రహ్మాన్, కరీనాకపూర్, రణధీర్‌కపూర్, నిత్యమీనన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జాకీర్ హుస్సేన్‌తో తమకున్న అనుబంధాన్ని X వేదికగా నెమరేసుకున్నారు. జాకీర్‌తో ఉన్న ఫొటోలను కరీనా కపూర్, ఏఆర్ రహ్మాన్ షేర్ చేసి ఆ మధుర స్మృతులను స్మరించుకున్నారు.
Zakir Hussain నేపథ్యం
zakir hussain biography : జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లారఖా కుమారుడు జాకీర్. ఏడేళ్ల వయసులోనే సంగీత ప్రపంచంలో అడుగు పెట్టిన ఆయన బాల్యం నుంచే అనేక ప్రదర్శనలు ఇస్తూ సంగీత ప్రియుల మదిని దోచుకున్నారు. తన తరం తబలా కళాకారుల్లో అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు భార్య అంటోనియా మినికోలా. కుమార్తెలు అనీసా, ఇసబెల్లా ఖురేషి ఉన్నారు.
మొదటి ప్రదర్శన
జాకీర్ 12 ఏళ్ల వయసులో తన తండ్రితో కలిసి ప్రదర్శన ఇచ్చారు. అప్పట్లో ఆయనకు ఐదు రూపాయలు పారితోషికం వచ్చింది. “నా జీవితంలో ఎన్నో డబ్బులు సంపాదించాను, కానీ ఆ ఐదు రూపాయలే నాకు అత్యంత విలువైనవి” అని ఆయన ఓ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన సంగీత జీవితంలో ఆయన పండిత్ రవి శంకర్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, శివకుమార్ శర్మ వంటి భారతీయ ప్రముఖులతో పాటు యో-యో మా, బేలా ఫ్లెక్, జాన్ మెక్‌లాఫ్లిన్ వంటి పాశ్చాత్య కళాకారులతో కలిసి అనేక ప్రదర్శనలు ఇచ్చారు.
అవార్డులు
Zakir Hussain awards తన కెరీర్‌లో జాకీర్ హుస్సేన్ నాలుగు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు. 2024 గ్రామీ అవార్డుల్లో భారతీయ కళాకారుడిగా మూడు గ్రామీలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. సంగీతంతో పాటు ‘హీట్ అండ్ డస్ట్’ ‘సాజ్స వంటి చిత్రాల్లో జాకీర్ నటించారు. 1988లో ‘తాజ్ మహల్ టీ’ ప్రచారంలోనూ ప్రజాదరణ పొందారు. జెంటిల్మెన్ మ్యాగజైన్ 1994లో నిర్వహించిన ఓటింగ్‌లో అమితాబ్ బచ్చన్‌ను అధిగమించి ‘సెక్సియెస్ట్ మాన్’ బిరుదును జాకీర్ పొందారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..