Tuesday, December 30Welcome to Vandebhaarath

YS Jagan | వక్ఫ్‌ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌

Spread the love

YS Jagan Waqf Board | కేంద్ర ప్రభుత్వం ఇటీవ‌ల పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్టిన వక్ఫ్‌ బిల్లు (Waqf Act) ను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో ముస్లిం మైనారిటీలతో జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. .. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘ముస్లిం మైనారిటీల సమస్యల ప‌రిష్కారంపై వైసీపీ నిరంత‌రం దృష్టిసారించింద‌ని తెలిపారు. మైనార్టీల‌ సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశామ‌ని, ముస్లిం మైనారిటీలకు మా పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని చెప్పారు. ఇక‌ వక్ఫ్‌ బిల్లుపై ముస్లింలు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను త‌మ‌ పార్టీ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడుతార‌ని చెప్పారు. పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చొరవ తీసుకుని, అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారని వైఎస్‌ జగన్ (YS Jagan)  స్పష్టం చేశారు

Highlights

అనంత‌రం ప‌లువురు ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. వక్ఫ్‌ భూముల్లో దాదాపు 70 శాతానికి పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా వక్ఫ్‌ చట్టంలో నిబంధనలు రూపొందించి తమ (వక్ఫ్‌) భూములు తమకు దక్కకుండా యత్నిస్తున్నార‌ని ఆరోపించారు. కొత్త వక్ఫ్‌ బిల్లును మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చే
సే ప్ర‌మాద‌ముంద‌ని తెలిపారు. ఆ బిల్లును వైసీపీ వ్యతిరేకించడంపై హర్షం వ్యక్తం చేశారు. బిల్లును వైసీపీ వ్యతిరేకించడం వల్లనే, కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని గుర్తు చేశారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *