30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
భారతదేశ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఏ ఒక్కరూ కూడా ఓటు వేయలేదు. అయితే రాజ్యాంగ సవరణ అవసరం కావడంతో సగానికిపైగా రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం చేయగానే బిల్లు పూర్తి చట్టంగా మారుతుంది. కాగా ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా మహిళా రిజర్వేషన్లు అమలు కావడానికి సంవత్సరాలు పడుతుంది. తర్వాతి జనాభా గణంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పూర్యయ్యాకే మహిళా రిజర్వేషన్ (Women’s Reservation Bill) అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.
నారీ శక్తి వందన్ అధినియమ్ (Nari Shakti Vandan Adhiniyam) పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సుమారు 10 గంటల పాటు సుదీర్ఘ చర్చల తర్వాత ఓటింగ్ చేపట్టారు. చివరికి సభలోని సభ్యులందరూ మద్దతుగా ఓటు వేశారు. ఈ ఓటింగ్ ప్రక్రియలో ఈ బిల్లుకు అనుకూలంగా సభలో ఉన్న 215 మంది మద్దతు తెలిపారు.
ఈ బిల్లును లోక్ సభలో గత మంగళవారం ప్రవేశ పెట్టగా.. బుధవారం సుదీర్ఘంగా చర్చించి ఓటింగ్ నిర్వహించారు. లోక్ సభలో ఉన్న 456 మంది సభ్యుల్లో 454 మంది ఎంపీలు ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపగా, కేవలం ఇద్దరు ఎంఐఎం ఎంపీలు మాత్రమే.. వ్యతిరేకంగా ఓటు వేశారు.
బిల్లు మోసం కాదు : ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. బిల్లు మోసం కాదని అన్నారు. ‘చట్టం ప్రకారం, తదుపరి పునర్విభజన 2026 తర్వాత మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకని ముందు రిజర్వేషన్లను తీసుకురాలేము. జనాభా లెక్కలు పూర్తైన వెంటనే నియోజకవర్గాల పున ర్విభజన జరుగుతుంది. ఆ తర్వాత రిజర్వేషన్లు కూడా త్వరగా పూర్తవుతా యి. మహిళా రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుంచి మద్దతు ఇస్తోంది. కాబట్టి చిత్తశుద్ధిపై సందేహం లేదు’ అని అన్నారు. రాజ్యసభలో, దాని ఎన్నికల వ్యవస్థ కారణంగా, మహిళలకు రిజర్వేషన్
ఎప్పుడో స్పష్టం చేయాలి : ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే
మహిళ రిజర్వేషన్ బిల్లు ఏ సంవత్సరం.. ఏ నెలలో అమలు చేస్తారో స్పష్టంగా వెల్లడించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించేదానిపై కేంద్రం వైఖరిని స్పష్టం చేయాలి. మహిళా రిజర్వేషన్ ను జనాభా గణంకాలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సీట్ల ఆధారంగా రిజర్వేషన్లు నిర్ధారించుకోవచ్చు. జనాభా లెక్కలు, పునర్విభజన తర్వాత సీట్ల సంఖ్య పెరిగినప్పుడు రిజర్వ్డ్డ్ సీట్ల సంఖ్య ను పెంచవచ్చు అని ఖర్గే సూచించారు.
ఎంపీలకు అభినందనలు తెలిపిన ప్రధాని
ఓటింగ్ ప్రారంభానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రాజ్య సభకు చేరుకున్నారు. అంతకుముందు లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిచ్చిన ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి ఆదర్శంగా నిలవాలని ప్రధాని కోరారు. ఉభయ సభల్లో ఈ బిల్లుపై 132 మంది ఎంపీలు మాట్లాడారని, parliament లో బిల్లుపై ఏకాభిప్రాయం రావడం.. ప్రజల్లో విశ్వాసం నింపుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి’కి కొత్త ఊపునిస్తుందని తెలిపారు. దేశ నిర్మాణంలో మహిళలు మరింత ఆత్మవిశ్వాసంతో నేతృత్వం వహిస్తారని మోడీ అన్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.