Posted in

Mock Drill : నేడు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్.. ప్రజలు ఏం చేయాలి?

Mock Drill
Spread the love

Mock Drill : భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు (India-Pakistan Tensions) పెరిగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) ఆదేశాల మరకు బుధవారం హైదరాబాద్ లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4:00 గంటలకు హైదరాబాద్ (ORR లోపల) మొత్తం సైరన్లు మోగించనున్నారు.
ఇండస్ట్రియల్ సైరన్లు, పోలీస్ మైకులు (చౌరస్తాల వద్ద) వాహనాలు, ఫైర్ సైరన్లు 4:00 గంటలకు వినిపించాల్సి ఉంటుంది. పోలీస్, ఫైర్, మెడికల్, పరిశ్రమల శాఖలు అన్ని సైరన్లు నగరంలో ఒకేసారి 2 నిమిషాలపాటు ప్రారంభమవుతాయి. ప్రజలు, వాలంటీర్లకు పలు సూచనలు పాటించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ (MHA) చెప్పింది.

మాక్ డ్రిల్స్ శత్రువుల దాడి సమయంలో ప్రజల్లో ధైర్యాన్ని పెంపొందించేందుకు, వారి ఆత్మరక్షణనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. ఈ మేరకు ‘ఆపరేషన్ అభ్యాస్’ అనే కోడ్ పేరుతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ మే 7వ తేదీ, సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు మొత్తం 244 జిల్లాలు బలహీన ప్రాంతాలుగా గుర్తించారు. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని ఓఆర్ఆర్ పరిధిలో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

Mock Drill : డ్రిల్ సమయంలో ఏం చేయాలి

డ్రిల్ సమయంలో సాయంత్రం 4 గంటలకు నగరమంతా సైరన్లు మోగిస్తారు. ఐసీసీసీ ద్వారా చర్యలు చేపడతారు. ఇండస్ట్రియల్ సైరన్లు, రోడ్ జంక్షన్లు, పోలీసు వాహనాల మైకులు, పెట్రోలింగ్ వాహనాలు, అగ్నిమాపక సైరన్లు వినిపిస్తాయి. పోలీసు, అగ్నిమాపక, వైద్య, పారిశ్రామిక విభాగాలు రెండు నిమిల పాటు నగరంలోని అన్ని సైరన్లు స్విచ్ ఆన్ చేస్తారు. వైమానిక దాడి సైరన్ వినిపించినప్పుడు ప్రజలు వెంటనే
ప్రాణాలకు భద్రత కలిగిన ప్రదేశానికి పరిగెత్తాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల నుంచి దూరంగా వెళ్లిపోవాలి. దృఢమైన, గట్టి భవనం లేదా భూగర్భ ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలి. అధికారిక సమాచారం, టీవీ, రేడియో, ప్రభుత్వ యాప్‌ల ద్వారా వార్తల అప్డేట్లు తెలుసుకోవాలి. పుకార్లు నమ్మొద్దు.. అలాగే వ్యాప్తి చేయొద్దు.. ఫేక్ న్యూస్ ను విస్తరించకుండా చూడాలి. ఇంట్లో ఉంటే విద్యుత్ పరికరాలు, గ్యాస్, స్టవ్‌లను ఆఫ్ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉంటే లోతట్టు ప్రదేశానికి వెళ్లి నేలమీద పడుకుని తలను కప్పుకోవాలి. అధికారులు ప్రమాదం ముగిసిందని ప్రకటించే వరకు బయటకు రావొద్దు..


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *