
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు (Warangal Railway Station) శరవేగంగా కొససాగుతున్నాయి. వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.25.41 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో భాగంగా భారతీయ రైల్వే (Indina Railways) స్టేషన్ ముఖ ద్వారం సుందరీకరించడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.
ఇప్పటికే ఓరుగల్లు రైల్వేస్టేషన్ ముందు భాగాన్ని కాకతీయుల కళావైభవం, వారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా తీర్చదిద్దారు.. సాయంత్రం వేళ విభిన్న రకాల రంగురంగు లైట్లతో స్టేషన్ వెలిగిపోతూ ప్రయాణికులను, బాటసారులను ఆకర్షిస్తోంది.
ఇక రైల్వే స్టేషన్ లోపల ప్రయాణీకులు సులభంగా రాకపోకలు సాగించేందుకు, రద్దీని తగ్గించడానికి 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మిస్తున్నారు. అధునాతన రెస్ట్ రూమ్ లు రెడీ అవుతున్నాయి.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, భద్రత కోసం ప్లాట్‌ఫారమ్‌లను అందంగా తీర్చిదిద్దుతున్నారు. స్టేషన్ లోపల సౌకర్యాలు కూడా గణనీయమైన మెరుగుదలలను చూడవచ్చు. ప్రయాణికులకు పరిశుభ్రమైన, మరింత సౌకర్యవంతమైన లివింగ్ ఏరియాలు, టాయిలెట్లు, వెయిటింగ్ హాళ్లను ఆధునీకరిస్తున్నారు.
స్టేషన్ పరిసరాలను మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి సుందరీకరణ పనులుజరుగుతున్నాయి. ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటారు. ఇంకా, స్టేషన్ ప్రయాణీకులందరికీ మరింత అందుబాటులో ఉండేలా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా స్పష్టంగా కనిపిచేలా సైన్ బోర్డుల, సిగ్నల్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను అమర్చనున్నారు.
Warangal Railway Station : 50% పనులు పూర్తి
దక్షిణ మధ్య రైల్వే (SCR) విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, వరంగల్ రైల్వే స్టేషన్‌లో సగానికి పైగా పునరాభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrit Bharat Station Scheme) కింద ఆధునీకరణకు గురవుతున్న తెలంగాణలోని 40 స్టేషన్లలో వరంగల్ రైల్వే స్టేషన్ ఒకటి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 40 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి కోసం రూ. 2,737 కోట్లు నిధులను కేంద్రం ఖర్చుచేస్తోంది. ప్రయాణీకుల సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడం, ఈ స్టేషన్లను ప్రాంతీయ వృద్ధి కేంద్రాలుగా మార్చడం దీని లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సికింద్రాబాద్, చర్లపల్లి, బేగంపేట వంటి ప్రధాన స్టేషన్లు ఉన్నాయి. వీటిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నగర ప్రాంతాల్లో రద్దీ తగిన విధంగా ఆధునీకరిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.