జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తుది జాబితా సిద్ధం చేసిన సిక్స్ మెన్ కమిటీ

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తుది జాబితా సిద్ధం చేసిన సిక్స్ మెన్ కమిటీ

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఏర్పడ్డ సిక్స్ మెన్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. సిక్స్ మెన్ కమిటీ కన్వీనర్ బీఆర్ లెనిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కో-కన్వీనర్లు బొక్క దయాసాగర్, వేముల నాగరాజు, సభ్యులు గడ్డం రాజిరెడ్డి, మసకపురి సుధాకర్, బొల్లారపు సదయ్యలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సభ్యుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ.. తుది జాబితాను రూపొందించింది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉన్న వారి అప్లికేషన్లను రిజెక్ట్ చేసిన కమిటీ..  అనుభవం ఉన్న జర్నలిస్టుల విషయంలో మానవతా ధృక్పథంతో వ్యవహరించింది. తుది జాబితాకు సంబంధించిన భూ సేకరణ కోసం అధికారులు, ప్రజాప్రతినిధులను కలసి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సభ్యులకు తెలియజేశారు. వివిధ చోట్ల అందుబాటులో ఉన్న ప్రభుత్వ జాగాలు చూసి ఫైనల్ చేసేందుకు మంత్రి, ఎంఎల్ఏతో కలసి ముందుకు సాగుతామని ప్రకటించింది. చిత్తశుద్ధితో తో చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమానికి తప్పుడు మాటలు మాట్లాడినా, సోషల్ మీడియాల్లో సిక్స్ మెన్ కమిటీపై అసత్య ప్రచారాలు చేసినా పట్టించుకోవద్దని కోరారు.

READ MORE  TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో రోడ్ల‌పైకి కొత్త‌గా 1000 ఎలక్ట్రిక్ బస్సులు

అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించేందుకు చేస్తున్న కృషికి మద్దతు పలకాలని కోరారు. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వారెవరైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే సిక్స్ మెన్ కమిటీని సంప్రదించాలని కోరారు., తొందరపడి తప్పుడు ప్రచారం చేస్తే వారి దరఖాస్తులను తొలగించటానికి వెనకాడబోమని వారు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *