పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

Warangal : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసివున్న ఇళ్లో  చోరీలకు పాల్పడుతున్న దొంగను సీీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దొంగ నుంచి పోలీసులు రూ.10లక్షల 9 వేల విలువ గల 163 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడిండిచారు. సూర్యపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన సన్నిది ఆంజనేయులు అలియాస్ అంజి చదువుకునే రోజుల్లోనే చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కగా జువైనల్ హోంకు తరలించారు. కొద్ది రోజుల అనంతరం నిందితుడు మరో మారు మిర్యాలగూడ, ఖమ్మం, హుజూర్ నగర్, గద్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో నిందితుడు ఆంజనేయులును పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిలో జైలు విడుదలయిన తర్వాత  కూడా ఎలాంటి మార్పు రాలేదు. నిందితుడు మరోసారి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసివున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకోని మొత్తం ఎనిమిది చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో హనుమకొండ, కేయూసీ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు చొప్పున మిల్స్ కాలనీ, పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీలకు పాల్పడ్డాడు. ఈ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు క్రైమ్స్ డీసీపీ ఆధ్వర్యంలో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఈ రోజు నిందితుడు చోరీ సొత్తును విక్రయించేందుకు హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ పరిసరాల్లో తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద బంగారు ఆభరణాలు గుర్తించి పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు పాల్పడిన నేరాలను అంగీకరించాడు.

READ MORE  మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఇంట్లోనే ఆయుష్మాన్ కార్డును ఇలా పొందండి

పోలీసులకు సీపీ అభినందనలు

నిందితుడిని పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన క్సైమ్స్ ఏసిపి మల్లయ్య, హనుమకొండ ఏసిపి కిరణ్ కుమార్, సీసీఎస్ ఇన్ స్పెక్టర్లు  సూర్య ప్రసాద్, శంకర్ నాయక్,  హనుమకొండ ఇన్ స్పెక్టర్ కరుణాకర్, ఏఏఓ సల్మాన్ పాషా, హనుమకొండ ఎస్ఐ సతీష్, సిసిఎస్. ఎస్ఐ సంపత్ కుమార్, బాపురావు, ఏఎస్ఐలు తిరుపతి, అశాఖీ, హెడ్ కానిస్టేబుళ్ళు రవికుమార్, మహ్మద్ అలీ, వేణుగోపాల్, శరుద్దీన్, జంపయ్య, కానిస్టేబుల్లు నజీరుద్దీన్, శ్రీకాంత్, నర్సింహులు, హోంగార్డ్ కుమార స్వామిని పోలీస్ కమిషనర్ రంగనాథ్ అభినందించారు.

READ MORE  Coach Restaurant | వరంగల్ రైల్వే స్టేషన్ లో త్వరలో కోచ్ రెస్టారెంట్..

ఆటోడ్రైవర్ ను సత్కరించిన పోలీస్ కమిషనర్

తన ఆటోలో మరిచిపోయిన బంగారు అభరణాల బ్యాగును నిజాయితీగా బాధిత మహిళకు అప్పగించిన ఆటో డ్రైవర్ ఫయిముద్దీన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్ సోమవారం ఘనంగా సత్కరించి నగదు రివార్డును అందజేశారు. వివరాల్లోకి వెళితే రెండు రోజుల క్రితం కాశిబుగ్గ ప్రాంతానికి మహిళ బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటో దిగే క్రమంలో ఆటోలోనే  మరచిపోయింది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగానే నగరంలో ఆటో డ్రైవర్లకు సమాచారం ఇచ్చారు. కొద్ది సేపటికి బాధిత మహిళ మరిచిపోయిన బ్యాగును తన ఆటోలో గుర్తించిన ఆటోడ్రైవర్ ఫయిముద్దీన్ వెంటనే పోలీసులతో పాటు ఆటో యూనియన్ సభ్యులకు సమాచారం ఇచ్చి బంగారు అభరణాల బ్యాగును పోలీసులకు అందజేశారు. ఆటో డ్రైవర్  వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో సీపీ రంగనాథ్ ఘనంగా సత్కరించి నగదు పురస్కారాన్ని అందజేసారు.

READ MORE  పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. పోలీస్‌ వాహనంతో పరార్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *