Saturday, August 30Thank you for visiting

మొగిలిచర్ల లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈటల

Spread the love

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, సత్యనారాయణ విగ్రహాల ఆవిష్కరణ

వరంగల్ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ పరిధిలోని చారిత్రక మొగిలిచర్లలో సోమవారం స్వామి వివేకానంద విగ్రహాన్ని మాజీ మంత్రి,  హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ  జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద కేవలం 39 సంవత్సరాలు జీవించి ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ధ్రువ వతారగా నిలిచారని అన్నారు. ప్రపంచ యువజన హృదయ సామ్రాట్ గా విరాజిల్లుతున్నారని తెలిపారు. యువత సన్మార్గంలో నడవాలంటే వివేకానంద చరిత్రను అధ్యయనం చేయాలని సూచించారు.

warangal News
మొగిలిచర్లలో వివేకానంద విగ్రహం ఆవిష్కరణ

గ్రామంలో ఒకేసారి అబ్దుల్ కలాం, వివేకానంద విగ్రహావిష్కరణతో పాటు మతోన్మాది చేతిలో హత్యకు గురైన పూజారి దేవల సత్యనారాయణ విగ్రహాలను ఆవిష్కరించుకోవడం గొప్పవిషయమని, ఇది శుభ పరిణామమని కొనియాడారు. యువత సన్మార్గంలో ప్రయాణించి ఆదర్శ పురుషులుగా తయారు కావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత యువత మద్యానికే ఎక్కువ ముగ్గు చూపేలా.. BRS పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. యువత తల్లిదండ్రులకు, సమాజానికి, దేశ సేవకు అంకితం కావాన్నారు. నిజమైన దేశభక్తులకు కులం లేదు.. మతం లేదు అని అన్నారు.Bjp వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండటి శ్రీధర్, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ విజయచందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సభ్యులు కుసుమ సతీష్ బాబు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు,
వన్నాల వెంకటరమణ, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాకం హరి శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్, రాధారపు శివకుమార్, సముద్రాల పరమేశ్వర్, ఎరుకల రఘునా రెడ్డి, రాంబాబు, రామ్ రెడ్డి, బిల్ల రమేష్, వేలాదిమంది గ్రామ ప్రజలతో ఊరేగింపుగా బయలుదేరి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.  వివేకానంద సేవా సంస్థ అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ జిల్లా కార్యదర్శి ఆడెపు రమేష్  పాల్గొన్నారు.


Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

 

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *