నేతన్నకు భరోసా బీఆర్ఎస్ సర్కారు
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
వరంగల్: నేతన్నలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత వారోత్సవాల్లో భాగంగా కొత్తవాడ అమరవీరుల స్థూపం నుంచి పద్మశాలి ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అనంతరం ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో నేతన్నలు నేసిన వస్త్రాలతో ఏర్పాటు చేసిన స్టాల్ ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేతన్నలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది మన బతుకులు గొప్పగా మార్చుకునేందుకేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధిచిన తెలంగాణలో ఆ ఫలాలను నేడు నేతన్నలకు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ లు మనల్ని కుటుంబ సభ్యుల్లా ఆదుకుంటున్నారని తెలిపారు. నేతన్నకు చేయూత, బీమా పథకాలతో పాటు మగ్గం ఉన్న ప్రతి కార్మికులకు 3వేలు,ఇన్సూరెన్స్ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నేతన్నకు కేసీఆర్ కేటీఆర్ బరోసాగా నిలుస్తున్నారన్నారు.-నేతన్నల నేసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఆదుకోవాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి గోదాంలో నిల్వ ఉంచుతున్నారని చెప్పారు.
తాను నేతన్నల సంక్షేమం కోసం వారి సమస్యలను ముఖ్యమంత్రి, కేసీఆర్ దృష్టికి తీసుకొనిపోవడమే కాకుండా పద్మశాలి పెద్దలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి స్వయంగా వారి సమస్యలను వివరించడం జరిగిందన్నారు. గత పాలకులు నేతన్నలను ఏ మాత్రం పట్టించుకోలేదని, పద్మశాలీలను ఓట్లుగా మలుచుకున్నారు తప్ప వారి అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శిచారు. కొత్తవాడ నేతన్నలు తయారు చేసిన వాటిని రెండు నెలలకు ఒకసారి ఖరీదు చేసే విధంగా మంత్రి కేటీఆర్ తో మాట్లాడి మార్గం సుగమం చేశానని చెప్పారు. కేసీఆర్ సర్కారులో నేతన్నకు ఇన్సూరెన్స్, హెల్త్ కార్డు, చేనేత మిత్ర ద్వారా నూలు రంగు రసాయనాలలో రాయితీలు కల్పించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తల్లిదండ్రుల మాదిరిగా మన నేతన్నలను కాపాడుతున్నారని తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా మీ బాగుకోసం కష్టపడుతున్నామని, అందుకే అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని హ్యాట్రిక్ సాధిచేందుకు తోడ్పాటును అందించి తనని మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నేతన్నలందరు సల్లంగా బతికితే తనకు అదే తృప్తి అని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం చేనేత వారోత్సవాలు పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అలాగే చేనేత సంఘాల పెద్దలను సన్మానించారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ, కార్పొరేటర్ ఆకుతోట తేజస్వి శిరీష్, బాలిన సురేష్, చేనేత సంఘం రాష్ట్ర కన్వీనర్, బీఆర్ఎస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు, ఆర్టీఏ మెంబర్ గోరంటల మనోహర్, జేడీ ఇందుమతి, ఏడీ రాఘవరావు, డీవో వెంకటేశ్వర్లు, డీసీబీ డైరెక్టర్ ఎలగం రవిరాజ్, పంతగాని శ్రీనివాస్, ఎలగం చిన్న కొమురయ్య, కొలిపాక మధునయ్య, డీసీసీబీ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు తోట హరీష్, డీఎంవో హరికిషన్ యెలుగం చిన్న భద్రయ్య, ఎలగం పెద్ద భద్రయ్య అడిగొప్పుల సంపత్, చేనేత సంఘాల పెద్దలు, కార్మికులు పాల్గొన్నారు.