- పది రోజుల పాటు అమ్మవారి వైభవమైన అలంకార దర్శనాలు
- విజయదశమి రోజున జలక్రీడోత్సవం, కలశోద్వాసన కార్యక్రమాలు
Warangal : వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో ఈనెల 22 నుంచి పది రోజుల పాటు భద్రకాళీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, కార్య నిర్వహణాధికారి రాముల సునీత వెల్లడించారు. భద్రకాళి ఆలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పది రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను వెళ్లడించారు. పది రోజుల అమ్మవారిని ఉదయం ఒక రూపంలో, సాయంత్రం మరొక రూపంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు.
- 22వ తేదీ సోమవారం శైలపుత్రీక్రమము, బాలత్రిపుర సుందరిగా,
- 23న అన్నపూర్ణాదేవిగా, 24న గాయత్రి అలంకారం,
- 25న మహాలక్ష్మీ అలంకారం,
- 26న రాజరాజేశ్వరీ లలితా మహా త్రిపుర సుందరిగా,
- 27న భువనేశ్వరీ అలంకారం,
- 28న భవానీ అలంకారం,
- 29న సరస్వతీ అలంకారం,
- 30న చద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా భద్రకాళీ మహాదుర్గాలంకారం,
- అక్టోబర్ 1వ తేదీ బుధవారం మహిషమర్థినీ అలంకారంలో భక్తులకు దర్శనమీయనున్నారు.
అక్టోబర్ 2వ తేదీ విజయ దశమి సందర్భంగా కలశోద్వాసన, భద్రకాళి అమ్మవారి జల క్రీడోత్సవాన్ని నిర్వహించనున్నారని, బతుకమ్మ పండుగ అంకురార్పన సందర్భంగా సెప్టెంబర్ 21న హరిద్రా దర్శనము, శరన్నవరాత్ర యాగ పూర్వాంగ విధి, అక్టోబర్ 3న శుక్రవారం ఏకాదశి తిధిన శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణం, పుష్ప యాగం, నీరాజన మంత్ర పుష్పం, మహదాశీర్వచనం, తీర్ధ, ప్రసాద వితరణ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో రాముల సునీత తెలిపారు.
శరన్నవరాత్రుల సందర్భంగా వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తుల కోసం వివిధ క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ముఖ్య అర్చకులు, ఎక్స్ అఫీషియో సభ్యులు పార్నంది నరసింహమూర్తి, వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ డాక్టర్ బి.శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, కటకం రాములు, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోతుకూరి మయూరి, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల ఆంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాసరావు, ఎస్.శ్రీధర్ రావు, మూగా శ్రీనావాస్ రావు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.