అయోధ్య లో సొంతిల్లు కావాలనుకునేవారికి సువర్ణావకావం.. రామాలయానికి దగ్గరలోనే ‘వశిష్ఠ్ కుంజ్ టౌన్‌షిప్
Ayodhya Vashishth Kunj Township | ఉత్తరప్రదేశ్‌లోని రామనగరి అయోధ్యలో సొంత ఇల్లు కావాలనుకునే వారికి సువర్ణావకాశం.. రామమందిరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ‘వశిష్ఠ్ కుంజ్ టౌన్‌షిప్’ (Vashishth Kunj Township ) నిర్మించాలని అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ నిర్ణయించింది. సెప్టెంబరు 10వ తేదీ మంగళవారం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ ఆలయానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ‘వశిష్ఠ కుంజ్ రెసిడెన్షియల్ స్కీమ్’ కింద టౌన్‌షిప్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
“శ్రీరాముడి నగరంలో స్థిరపడాలని భావిస్తున్న ప్రజలకు శుభవార్త.. శ్రీరామ ఆలయానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ‘వశిష్ఠ్ కుంజ్ రెసిడెన్షియల్ స్కీమ్’ కింద టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తారు. 75 ఎకరాల స్థలంలో ఈ గృహనిర్మాణ పథకాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దాదాపు 10 వేల మందికి రెసిడెన్షియల్ ప్లాట్లు కేటాయిస్తారు’’ అని ప్రభుత్వం ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.
నివేదికల ప్రకారం.. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ.. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లో ప్రజలు త్వరలో భూమిని కొనుగోలు చేయవచ్చు. అయోధ్య ఇటీవల పర్యాటకంగా వాణిజ్య పరంగా ఎంతో అభివృద్ధి చెదింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇక్కడ కొత్తగా టౌన్ షిప్ నిర్మించాలని భావిస్తోంది. కొద్ది రోజుల్లో నగర జనాభా పెరుగుతుందని భావిస్తున్నందున, ఈ ప్రాజెక్ట్ ప్రాంత నివాసులకు ప్రయోజనకరంగా ఉండవచ్చు.
కాగా జాతీయ రహదారి 27 లక్నో-గోరఖ్‌పూర్‌లోని సోహవాల్ తహసీల్‌లోని ఫిరోజ్‌పూర్ ఉపరహార గ్రామానికి సమీపంలో ‘వశిష్ఠ్ కుంజ్ టౌన్‌షిప్’ అభివృద్ధి చేయనున్నారు. దీని నిర్మాణానికి దాదాపు రూ. 300 కోట్లు ఖర్చవుతుండగా, తాజాగా ప్రభుత్వ అనుమతి లభించింది. ఇంకా, రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న సుమారు 30 హెక్టార్ల భూమిలో గృహ నిర్మాణాలు చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం 30 హెక్టార్ల భూమిని సేకరించనున్నట్లు అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ఏడీఏ) కార్యదర్శి సత్యేంద్ర సింగ్ గత వారం ప్రకటించారు. ఇప్పటి వరకు 24 హెక్టార్ల భూమిని సేకరించినట్లు తెలిపారు. మిగిలిన భాగం త్వరలో కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. ఈ పథకంలో రెసిడెన్షియల్ ప్లాట్‌లతోపాటు కమర్షియల్ ప్లాట్లు కూడా అందజేస్తామని, దీని వల్ల దాదాపు 10 వేల మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకాన్ని పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాతే అధికార యంత్రాంగం ప్రజలకు కేటాయిస్తుంది.
కొత్త టౌన్ షిప్ లో సకల సౌకర్యాలు..
Ayodhya Vashishth Kunj Township అయోధ్యలో ఫస్ట్ గ్రేడెడ్ హైటెక్ టౌన్‌షిప్ అవుతుందని, ఇందులో అన్ని సౌకర్యాలను కల్పించనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. టౌన్‌షిప్‌లో పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు కూడా ఉంటాయి. దీంతోపాటు పటిష్ట భద్రత కోసం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ ( ADA) అధికారుల ప్రకారం, ఈ పథకం వల్ల దాదాపు 10,000 మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు. ఇది త్వరలో అయోధ్య నగరంలో స్థిరపడాలనుకునే వారందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..