Vane Bharat Express | వందే భారత్ రైళ్ల వేగం తగ్గింది…!
Vane Bharat Express Speed | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. దీంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. తక్కువ టైంలో సుదూర గమ్యస్థానాలకు వెళ్లడానికి ఎక్కువ మంది ప్రయాణికులు ఈ వందేభారత్ రైళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే కొన్నాళ్లుగా వందే భారత్ రైళ్ల వేగం క్రమంగా తగ్గిపోతున్నట్లు తెలిసింది. గత మూడేండ్లలో వందే భారత్ రైళ్ల స్పీడ్ గంటకు 84.48 కిలోమీటర్ల నుంచి 76.25 కిలోమీటర్లకు పడిపోయింది. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానం ఇచ్చింది. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కుచ ట్టం కింద దరఖాస్తు చేయగా రైల్వే అధికారులు సమాధానమిచ్చారు.
IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరలో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర
కాగా వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లను 2019 ఫిబ్రవరి 15న మొదటి సారి ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభించారు. గంటలకు 160 కిలోమీటర్ల వేగతంతో ప్రయాణించేలా వీటిని అత్యాధునిక టెక్నాలజీతోపాటు ఆదునిక సౌకర్యాలతో ఈ రైళ్లను తీసుకొచ్చారు. కానీ వందే భారత్ రైళ్ల యావరేజ్ స్పీడ్ (Vane Bharat Express Speed) 2020-21లో 84.48 కిలోమీటర్లు ఉండగా.. 2022-2 లో ఆ వేగం 81.38 కిలోమీటర్లకు పడిపోగా 2023-24 నాటికి 76.26 కిలోమీటర్లకు తగ్గిందని రైల్వే శాఖ పేర్కొంది. ఈ వేగం తగ్గింపు కేవలం వందే భారత్ రైళ్లు మాత్రమే కాదని అన్ని రైళ్లకు వర్తిస్తుందని వెల్లడించింది. ఇందుకు కారణం.. వివిధ మార్గాల్లో ట్రాక్‌ల పునరుద్ధరణ, స్టేషన్ల ఆధునికీకరణ వల్ల రైళ్ల వేగం కూడా తగ్గిందని పేర్కొంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..