ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ – బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ – బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్
న్యూ ఢిల్లీ: హైదరాబాద్ , బెంగళూరులను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (Vande bharath Express) 25 ఆగస్టు, 2023న ప్రారంభించనున్నారు. ఇది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నడిచే ప్రస్తుత రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలా కాకుండా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
హైదరాబాద్ – బెంగళూరు హైదరాబాద్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలో ప్రారంభం కానుంది. ఇది హైదరాబాద్, బెంగళూరులను కలుపుతుంది, 615 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల 15 నిమిషాల్లోనే చేరుకుంటుంది. ఈ హై-స్పీడ్ సర్వీస్ భారతదేశంలోని రెండు ప్రముఖ సాఫ్ట్‌వేర్ హబ్‌లు అయిన హైదరాబాద్ బెంగుళూరు మధ్య కీలకమైన నగరాలను కలపుతుంది.
బెంగళూరు-హైదరాబాద్ వందే భారత్: స్టాప్‌లు అంచనా
హైదరాబాద్‌కు రానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేడం, రాయచూర్ జంక్షన్ , గుంతకల్ జంక్షన్‌లో షెడ్యూల్ స్టాప్‌లు వేయాలని భారతీయ రైల్వే ( indian railways) భావిస్తోంది. ఈ స్టాప్‌లు మార్గంలో ప్రయాణీకులకు సౌకర్యవంతమైన జర్నీ ఆప్షన్లను అందిస్తాయి. హైదరాబాద్, బెంగళూరు మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. ఈ రైలు హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరులోని యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ మధ్య నడుస్తుంది.
కాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, దీనిని రైలు 18 అని కూడా పిలుస్తారు. ఇది భారతీయ రైల్వేలు నిర్వహించే సెమీ-హై-స్పీడ్ రైలు. ఇది మొదటిసారిగా 2019లో భారతదేశంలో ప్రారంభించారు. అప్పటి నుండి దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రైళ్లలో ఒకటిగా మారింది.
బెంగళూరు – హైదరాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభ తేదీ, టిక్కెట్ ఛార్జీలు, స్టాప్‌లు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. ఏది ఏమైనప్పటికీ, రెండు నగరాల మధ్య నిత్యం ప్రయాణించే అనేక మంది IT నిపుణులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులకు రైలు ప్రయాణం వేగవంతంగా , సౌకర్యవంతంగా మారుతుంది.
మొదటి వందేభారత్ రైలు ..
హైదరాబాద్‌కు మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు జనవరి 15, 2023 న ప్రారంభించారు. ఇది సికింద్రాబాద్, విశాఖపట్నంలను కలుపుతుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సేవలందిస్తున్న మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు సామర్లకోట్ జంక్షన్, రాజమండ్రి, విజయవాడ జంక్షన్, ఖమ్మం. వరంగల్ వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏప్రిల్ 8, 2023న హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ రైలు సికింద్రాబాద్ – హైదరాబాద్ – తిరుపతి మధ్య కేవలం 8 గంటల 15 నిమిషాల్లో 662 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది సగటున గంటకు 80 కిమీ వేగంతో దూసుకెళ్లుంది. హుందుస్తాన్ టైమ్స్ ప్రకారం, నల్గొండ, గుంటూరు జంక్షన్, ఒంగోలు,
నెల్లూరులో ఆగుతుంది.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.