
వాషింగ్టన్: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి మండిపడ్డారు. భారత్‌పై 2025 ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాలు (20% Tariff) విధించనున్నట్లు ఆయన ఈరోజు ప్రకటించారు. అంతేకాదు, కొన్ని అంశాల్లో భారత్ అదనపు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో పంచుకున్న పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికా సుంకాలకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచి భారతదేశంపై 25% సుంకం విధించడంతోపాటు జరిమానా వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో భారతదేశం ఒకటి అని ట్రంప్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ పోస్ట్ లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. ఆయన పోస్ట్‌లో ఇలా రాశారు- ‘గుర్తుంచుకోండి, భారతదేశం మా స్నేహితుడు కానీ గత కొన్ని సంవత్సరాలుగా భారత్ సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నందున మేము దానితో చాలా తక్కువ వాణిజ్యం చేశాం.’
భారతదేశం రష్యా (Russia)నుంచి చమురు, ఆయుధాలను కొనుగోలు చేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. కాబట్టి ఈ చర్య అవసరమని అన్నారు. అదే సమయంలో, ట్రంప్ భారత్‌ను టార్గెట్ చేశారు. భారతదేశం చాలా ఎక్కువ పన్నులు విధిస్తోందని ఆయన అన్నారు. ఇది వాణిజ్యంలో కూడా చాలా ఇబ్బందులను సృష్టిస్తుంది. రష్యా నుండి ఇంధనం, ఆయుధాలను కొనుగోలు చేసినందుకు భారత్ కూడా అదనపు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. . ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్‌లో ఇలా రాశారు, ‘గుర్తుంచుకోండి, భారతదేశం మన మిత్రుడు. కానీ, సంవత్సరాలుగా మేము వారితో చాలా తక్కువ వ్యాపారం చేశాం. ఎందుకంటే వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రపంచంలోనే అత్యధికం. భారత్‌లో అన్ని దేశాల కంటే అత్యంత కష్టతరమైన, చెత్త ద్రవ్యేతర వాణిజ్య అడ్డంకులు ఉన్నాయని అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.