యూపీలో మరో దారుణం.. మైనర్ బాలిక కిడ్నాప్.. 5 రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో అత్యాచారం.. నిందితుడి ఆస్పత్రి సీజ్

యూపీలో మరో దారుణం.. మైనర్ బాలిక కిడ్నాప్.. 5 రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో అత్యాచారం.. నిందితుడి ఆస్పత్రి సీజ్

UP Rampur Incident | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మరో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన షాకింగ్ కేసు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ కేసులో నిందితులను సాజిద్ పాషా, ముదస్సిర్‌లుగా గుర్తించారు. రాంపూర్ జిల్లాలోని గ్రీన్ సిటీ హాస్పిటల్ అనే పేరున్న ఆసుపత్రికి పాషా డైరెక్టర్ గా ఉన్నారు. ఆగస్టు 31, 2024 నిందితులు మైనర్ బాధితురాలిని కోచింగ్‌కు తీసుకువెళతాననే నెపంతో కిడ్నాప్ చేశారు. నివేదికల ప్రకారం, నిందితులు యూపీ, ఉత్తరాఖండ్‌లలో లొకేషన్‌లు మారుస్తూనే ఉన్నారు. బందీగా ఉన్న మైనర్ బాలిక పై 5 రోజుల పాటు అత్యాచారం చేశారు. చివరకు విషయం తెలుసుకొని పోలీసులు బాధితురాలిని రక్షించారు.

నివేదికల ప్రకారం.. మైనర్ బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు విచార‌ణ చేప‌ట్టారు. నిందితులు ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తమ రహస్య స్థావరాలను నిరంతరం మారుస్తూనే ఉన్నారు. అయితే, ఐదు రోజుల తర్వాత, పోలీసులు థార్ వాహనం నుంచి మైనర్ బాలికను స్వాధీనం చేసుకున్నారు. అక్కడికక్కడే ముదస్సిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు సాజిద్ పాషా మాత్రం పరారీలో ఉన్నాడు. నిందితుడు సాజిద్‌ ఆసుపత్రిని సీలు చేశారు. ప‌రారీలో ఉన్న నిందితుడిని ప‌ట్టిస్తే ఇస్తే రూ.25,000 నగదు బహుమతి ఇస్తామ‌ని ప్రకటించారు.

ఈ కేసు రాంపూర్‌లోని స్వర్ కొత్వాలి ప్రాంతానికి సంబంధించినది. నివేదికల ప్రకారం , సాజిద్ పాషా గ్రీన్ సిటీ హాస్పిటల్ పేరుతో ఆసుపత్రిని నడుపుతున్నాడు. ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్న ఓ మైనర్‌ బాలికకు కోచింగ్‌ ఇప్పిస్తానంటూ ఆగస్టు 31న ఫోన్‌ చేశాడు. కొద్ది దూరంలో వేరే అమ్మాయిలు ఉన్నారని బాధితురాలిని న‌మ్మ‌బ‌లికి తన థార్‌లో కూర్చోబెట్టుకున్నాడు. కానీ ముందు విద్యార్థినులు ఎవరూ లేరు. నిందితులు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ త‌ర్వాత సాజిద్ పాషా బాధితురాలిని అపహరించి, ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లోని రిసార్ట్‌కు తీసుకెళ్లాడు, అక్కడ అతను బాధితురాలిని బందీగా ఉంచి 3 రోజుల పాటు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతను తన రహస్య స్థావరాలను మారుస్తూ బాధితురాలిని హల్ద్వానీ, రుద్రపూర్‌కు తీసుకెళ్లాడు,

READ MORE  Bahraich Violence | భరూచ్‌ నిందితుల్లో.. ఇద్దరిపై పోలీస్‌ కాల్పులు

UP Rampur Incident బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తుపాకీతో బెదిరించారని, మౌనంగా ఉండాలన్నారు. నిందితులు నకిలీ గుర్తింపు కార్డులతో హోటల్‌, రిసార్ట్‌ గదులు బుక్‌ చేశారు. సాజిద్‌ వద్ద నకిలీ పోలీస్ ఐడీ కూడా ఉన్నట్లు సమాచారం. 5 రోజుల తర్వాత, సాజిద్ బాధితురాలిని రాంపూర్‌కు తీసుకువచ్చాడు. పోలీసుల ఒత్తిడి పెరగడంతో, అతను ఆమెను తన స‌హ‌చ‌రుడు ముదస్సిర్‌కు అప్పగించి పారిపోయాడు.
పోలీసులు ముదస్సిర్‌ను పట్టుకుని మైనర్‌ను రక్షించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *