
TTD Employees Transferred : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అన్యమత ఉద్యోగులకు ఏపి ప్రభుత్వం షాకిచ్చింది. టీటీడీలో హిందూవేతర ఉద్యోగులపై పాలక మండలి బదిలీ వేటు వేసింది. ఇందులో భాగంగా 18 మంది ఉద్యోగులను అధికారులు ట్రాన్స్ ఫర్ చేశారు. కాగా టీటీడీలో మొత్తం 300 మంది అన్యమతస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ బదిలీ చేయాలని చాలా రోజులుగా భక్తుల నుంచి డిమాండ్ వస్తోంది .
కాగా బదిలీ అయిన వారి (TTD Employees Transferred ) లో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, వివిధ విద్య సంస్థల్లోని లెక్చరర్లు, హాస్టల్ వార్డెన్, తదితరులు ఉన్నారు. త్వరలోనే మరికొంత మంది అన్యమత ఉద్యోగులను కూడా ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు డైరెక్ట్ క్యూలైన్‌లో వెళ్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి గంలు పడుతోంది. మంగళవారం శ్రీవారిని 73,599 మంది భక్తులు దర్శించుకున్నారు. 16,069 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.21 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
తిరుమలకు సంబంధించి ఇతర వార్తల విషయానికొస్తే.. : TTD అధికారులు శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల జారీని (Sarvadarshan Tokens Issued) బుధవారం రాత్రి నుంచి పునరుద్దరించనున్నారు. రథ సప్తమి వేడుకల సందర్భంగా ఈనెల 3వ తేదీ నుంచి ఎస్డి టోకెన్లను టీటీడీ అధికారులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. రథసప్తమి ఉత్సవాలు ముగియడంతో తిరిగి బుధవారం రాత్రి 10 గంటల నుంచి భక్తులకు టోకెన్స్‌ను టీటీడీ అధికారులు జారీ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
[…] ఖర్చులు వృథా కావడమే కాకుండా తిరుమల దర్శనానికి సమయానికి […]