Wednesday, April 16Welcome to Vandebhaarath

TTD Chairman Members | టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు.. పాలక మండలి సభ్యుల వివరాలు ఇవీ..

Spread the love

TTD Chairman Members  | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో  టీటీడీ పాలకమండలి కొలువుదీరనుంది.ఈ మేరకు టీటీటీ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

టీటీడీ బోర్డు సభ్యులు వీరే..

  • జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
  • వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
  • ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
  • పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
  • జాస్తి పూర్ణ సాంబశివరావు
  • నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
  • బూంగునూరు మహేందర్‌ రెడ్డి (తెలంగాణ)
  • శ్రీసదాశివరావు నన్నపనేని
  • కృష్ణమూర్తి ( తమిళనాడు)
  • కోటేశ్వరరావు
  • మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌
  • జంగా కృష్ణమూర్తి
  • దర్శన్‌. ఆర్‌.ఎన్‌ (కర్ణాటక)
  • జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌ (కర్ణాటక)
  • శాంతారామ్‌
  • పి.రామ్మూర్తి (తమిళనాడు)
  • జానకీ దేవి తమ్మిశెట్టి
  • అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)
  • బూరగాపు ఆనందసాయి (తెలంగాణ)
  • సుచిత్ర ఎల్ల (తెలంగాణ)
  • నరేశ్‌కుమార్‌ ( కర్ణాటక)
  • డా.అదిత్‌ దేశాయ్‌ (గుజరాత్‌)
  • సౌరభ్‌ హెచ్‌ బోరా (మహారాష్ట్ర)
READ MORE  Mumbai-Ahmedabad Bullet Train | వ‌డివ‌డిగా బుల్లెట్ ట్రైన్ ప‌నులు.. 508 కి.మీ ప‌రిధిలో 12 స్టేష‌న్లు..

బీఆర్ నాయుడు ప్రస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన చైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు నియమితులయ్యారు. టీవీ 5 ఛైర్మన్ గా తెలుగు రాష్ట్రాలకు బీఆర్ నాయుడు సుపరిచితులు. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లిలోని వ్యవసాయ కుటుంబంలో బీఆర్ నాయుడు జన్మించారు. తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు- లక్ష్మిలకు ఆరుగురు సంతానం కాగా అందులో చిన్న కుమారుడు బీఆర్ నాయుడు. స్థానికంగా చదువు పూర్తి చేసిన నాయుడు.. తరువాత హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో ఉద్యోగంలో చేరారు. బీహెచ్ఈఎల్ సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లోనూ పనిచేశారు. 12 వేలమంది ఉద్యోగులు ఉండే బీహెచ్ఇఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు.
బీఆర్ నాయుడు సతీమణి విజయలక్ష్మి కూడా బీహెచ్ఈఎల్ లోనే పనిచేశారు. కాగా అమరావతి రాజధాని ఉద్యమాన్ని సమర్ధించినందుకు వైసీపీ ప్రభుత్వం బీఆర్ నాయుడుపై రాజద్రోహం కేసులు పెట్టింది.

READ MORE  Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *