Telangana

హైదరాబాద్ ప్రజలకు TSRTC శుభవార్త – టీఏవైఎల్ టిక్కెట్‌పై ప్రత్యేక తగ్గింపు

Spread the love

హైద‌రాబాద్ ప్రయాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ (TSRTC) శుభ‌వార్త చెప్పింది. పంద్రాగ‌స్టు వేడుల‌ సందర్భంగా ‘ఫ్రీడమ్ ఆఫర్’ కింద ట్రావెల్ యాజ్ యు లైక్ (టీఏవైఎల్) టిక్కెట్ ధరను తగ్గించింది. అయితే ఈ ఆఫ‌ర్‌ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈనెల 15 నుంచి 31వ తేదీ వరకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు వెల్ల‌డించారు.

హైద‌రాబ‌ద్‌ మెట్రో డీలక్స్ బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ఈ టిక్కెట్లను కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించారు. పెద్దలకు ఇంతకు ముందు టిక్కెట్ ధర రూ.150 కాగా, ఫ్రీడ‌మ్‌ ఆఫర్ కింద 130 రూపాయ‌ల‌కు తగ్గించారు. మహిళలు, సీనియర్ సిటిజన్స్‌కు ఇంతకు ముందు రూ. 120గా ఉన్న టిక్కెట్ ధరను రూ. 110కి తగ్గించారు. పిల్లలకు రూ. 100 ఉండగా, దీనిని రూ. 90కి సవరించారు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *