టీఎస్ ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీలు త‌గ్గింపు..! 

టీఎస్ ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీలు త‌గ్గింపు..! 

విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌..

TSRTC E-Buses : హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడకు వెళ్లే ప్ర‌యాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త వినిపించింది. ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ ఎలక్ట్రిక్ బ‌స్సుల ఛార్జీల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎం.డీ వీసీ స‌జ్జ‌నార్ వెల్లడించారు.. ప్రారంభ ఆఫ‌ర్ కింద ఈ-గ‌రుడ బ‌స్సు ఛార్జీల‌ను తగ్గించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫ‌ర్ నెల రోజుల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంద‌న్నారు. మియాపూర్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 830 నుంచి రూ. 760కి, ఎంజీబీఎస్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 780 నుంచి రూ. 720కి త‌గ్గించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు.

READ MORE  Janasena TDP First List | టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్

మంగళవారం హైదరాబాద్‌ మియాపూర్‌లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోగా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించారు. సుమారు 20 నిమిషాలకో ఈ-గరుడ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్‌ నగరం నుంచి నిత్యం 50 వేల మంది విజయవాడ, రాజమండ్రికి ప్రయాణిస్తున్నారని, అందుకే వీరి కోసం తొలుత TSRTC E-Buses ను విజయవాడకు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

READ MORE  Inner Ringroad Case : గురి.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్

బస్సులు బయలుదేరే సమయాలు..

  • మియాపూర్ నుంచి : ఉదయం 6:25, ఉదయం 8:25, ఉదయం 10:25, సాయంత్రం 6:05, రాత్రి 7:45, రాత్రి 9:45 గంటలకు ఈ-గరుడ బస్సులు బయలుదేరుతాయి.
  • MGBS నుంచి : ఉదయం 8:10, ఉదయం 10:10, మధ్యాహ్నం 12:10, రాత్రి 7:50, రాత్రి 9:30, రాత్రి 11:30 గంటలకు ఈ-గరుడ బస్సులు స్టార్టవుతాయి
  • విజయజవాడ నుంచి : ఉదయం 6:20, ఉదయం 8:00, ఉదయం 10:00, సాయంత్రం 6:40, రాత్రి 8:40, రాత్రి 10:40 గంటలకు ఈ-గరుడ బస్సులు బయలుదేరుతాయి. 
READ MORE  Old city metro line | పాతబస్తి మెట్రో పనులు మొదలయ్యేది అప్పుడే..

Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *