TG TET APPLICATION | నవంబర్ 7 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ
TG TET APPLICATION | తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ నెల 7 నుంచి దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖ వెల్లడించింది. తెలంగాణలో సోమవారం టెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తొలుత నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. అయితే పలు కారణాలతో తాజాగా స్వల్ప మార్పులు చేశారు. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది. రెండో విడత టెట్‌కు నవంబర్ లో నోటిఫికేషన్ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని గత ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినపుడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
టెట్ పరీక్షకు అర్హత
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలని నిబంధన విధించడంతో పెద్ద సంఖ్యలో ఇన్ సర్వీస్ టీచర్లు సైతం ఈ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది విడతలుగా పరీక్షలు నిర్వహించింది. జనవరిలో పదోసారి నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..