Triple Talaq |ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adithynath) ను పొగిడినందుకు ఓ ముస్లిం మహిళకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చేప్పేశాడు. మోదీని ప్రశంసించడాన్ని జీర్ణించుకోలేక ఆమె భర్త ఒక్కసారిగా ఆగ్రహించాడు. ఆపై వెంటనే ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పి (triple talaq) విడాకులు ఇచ్చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది.
ఈ ఘనటకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మొహల్లా సరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళకు గత ఏడాది డిసెంబర్ 13న అయోధ్యలోని మొహల్లా దిల్లీ దర్వాజా ప్రాంతానికి చెందిన అర్షద్‌తో వివాహమైంది. పెళ్లి తర్వాత అయోధ్యలోని అత్తగారి ఇంటికి చేరుకున్న సదరు మహిళ అక్కడి రోడ్లు, నగర అభివృద్ధి, చూసి ఆశ్చర్యపోయింది. సంతోషంతో భర్త ముందు సీఎం యోగి, ప్రధాని మోదీని ఆమె పొగిడింది. దీంతో ఆగ్రహించిన భర్త అర్షద్ భార్యను కొట్టి.. కాలుతున్న పాన్‌ను ఆమెపైకి విసిరాడు. అంతటితో ఆగకుండా భార్యను పుట్టింటికి పంపించాడు. కొన్ని రోజుల తర్వాత బంధువుల జోక్యంతో ఆ మహిళ తిరిగి అయోధ్యలోని భర్త ఇంటికి చేరుకోంది. భర్త తనను కొట్టడంతోపాటు ప్రధాని మోదీ, యోగిని ప్రశంసించినందుకు తిట్టి ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడని సదరు ముస్లిం మహిళ ఆరోపించింది. భర్తతో పాటు అత్తింటి వారు కూడా తనను వేధించి చిత్రహింసలకు గరిచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అర్షద్, అతడి కుటుంబ సభ్యులతో సహా 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..