Saturday, January 24Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

ISKCON పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్..

ISKCON పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్..

Andhrapradesh, Trending News
Bangladesh Violence | బంగ్లాదేశ్ లో హిందువులపై హింస, ఇస్కాన్‌ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishna Das) అరెస్టు చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. చిన్మోయ్ అరెస్టును ఖండించారు. హిందువులందరూ ఐక్యంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్ర‌ధాని ముహమ్మద్ యూనస్‌ను కోరారు.ఇస్కాన్ బంగ్లాదేశ్ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు నిర్బంధించడాన్ని మనం అందరం కలిసి ఖండిద్దాం. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని (ప్రభుత్వం) హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అని కళ్యాణ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత సైన్యం చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు.బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భా...
Sambhal violence : సంభాల్ హింసాకాండ‌లో 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు, 27 మంది అరెస్టు

Sambhal violence : సంభాల్ హింసాకాండ‌లో 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు, 27 మంది అరెస్టు

Trending News
Sambhal violence  :  సంభాల్ హింసాకాండలో 27 మందిని అరెస్టు చేశామని, పురాత‌న మసీదుపై భారత పురావస్తు సర్వే (ASI) సర్వేపై రాళ్లు రువ్వడం.. రాళ్లదాడి ఘటన తర్వాత ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో పరిస్థితిని సాధార‌ణ స్థితికి తెచ్చేందుకు చ‌ర్య‌లుచేప‌ట్టిన‌ట్లు ఆంజనేయ కుమార్ సింగ్ ప్రకటించారు."ఇప్పటి వరకు, 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. 22 మంది పేర్లను నమోదు చేశాం. 27 మందిని అరెస్టు చేశారు. ఇంకా 74 మందిని గుర్తించాం. ఇతర నిందితుల‌ను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. పరిస్థితిని సాధారణీకరించడమే మా ల‌క్ష్యం. బయటి వ్యక్తుల ప్రభావానికి లోనుకాకుండా ప్రజలను అప్ర‌మ‌త్తం చేస్తున్నామ‌ని చెప్పారు నిరాధారమైన ప్రకటనలు చేయడం మానుకోవాలని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కోరారు.“ప్రజలు కేవలం దర్యాప్తు కోసం మాత్రమే కాకుండా, పరిస్థితిని సాధారణీకర...
ISKCON | ఇస్కాన్‌ చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభును అదుపులోకి తీసుకున్న బంగ్లా ప్రభుత్వం..!

ISKCON | ఇస్కాన్‌ చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభును అదుపులోకి తీసుకున్న బంగ్లా ప్రభుత్వం..!

Trending News
ISKCON | హిందువులపై జరిగిన అకృత్యాలను నిరసించిన ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభును బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం అరెస్టు చేసింది. ఢాకా నుంచి చిట్టగాంగ్‌ వెళ్లేందుకు ఆయన సోమవారం హజ్రత్‌ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చిన్మయ్‌ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభు బంగ్లాదేశ్‌లోని సనాతన్‌ జాగరణ్‌ మంచ్‌ ప్రతినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అక్టోబర్‌ 30న బంగ్లాదేశ్‌లో జాతీయ జెండాను అవమానించినందుకు గాను చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభుతో సహా 13 మందిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. అక్టోబర్‌ 25న లాల్దిఘి ర్యాలీలో బంగ్లాదేశ్‌ జాతీయ జెండా కంటే ఎత్తున ఇస్కాన్‌కు చెందిన కాషాయరంగు జెండా ఎత్తులో ఎగురవేశారు. ఈ క్రమంలోనే పలువురిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి...
సంభాల్ జామా మసీదు చరిత్ర ఏమిటి?

సంభాల్ జామా మసీదు చరిత్ర ఏమిటి?

Trending News
సంభాల్‌లో జామా మసీదు ఎక్కడ ఉంది? Sambhal News | ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లా కేంద్రం మధ్యలో మొహల్లా కోట్ పూర్విలో షాహీ జామా మసీదు ఉంది. ఈ భవనం 1920లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) క్రింద రక్షిత ప్రదేశంగా  ప్రకటించింది. ఆ తర్వాత ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన భవనంగా కూడా పరిగణించారు. సంభాల్‌లోని జామా మసీదు (Sambhal Jama Masjid)  ప్రధాన ద్వారం ముందు ఎక్కువ మంది హిందూ జనాభా నివసిస్తుండగా, ప్రహరీ వెనుక ప్రాంతంలో ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. సంభాల్ జామా మసీదు చరిత్ర ఏమిటి? 1526 నుంచి 1530 మధ్య బాబర్ ఐదు సంవత్సరాల పాలనలో నిర్మించిన 3 మసీదులలో సంభాల్ జామా మసీదు ఒకటి. మిగిలిన రెండు మసీదుల్లో ఒకటి పానిపట్ మసీదు కాగా, మరొకటి అయోధ్యలో కూల్చివేసిన బాబ్రీ మసీదు. సంభాల్  నగరంలో ప్రస్తుతం ముస్లిం ఎక్కువగా ఉంది. కానీ హిందూ గ్రంథాలలో ఈ నగరానికి ప్రత్యేక ప్రస్తావన ఉంది. కలియుగ...
Adani group | ఒకవైపు అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు.. మరోవైపు తెలంగాణలో అదానీ గ్రూప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం  ఒప్పందాలు..

Adani group | ఒకవైపు అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు.. మరోవైపు తెలంగాణలో అదానీ గ్రూప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు..

Trending News
Adani group | న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ(Goutham Adani)  పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పిలుపునివ్వడంతో తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని ఇరకాటంలో పడేట్లు అయింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలపై USలో అభియోగాలు మోపబడిన తర్వాత అతనిపై చర్య తీసుకోవాలని గాంధీ డిమాండ్‌ చేసిన విష‌యం తెలిసిందే.. అయితే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అదానీ గ్రూప్ నుంచి విరాళాలు స్వీకరించిన వార్త‌లు అదానీ గ్రూప్ తో తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌కు సంబంధించిన వార్త‌లు ట్రెండింగ్ లోకి వ‌చ్చాయి. రాహుల్ గాంధీ ఏం చెప్పారు? భారతీయ అధికారులకు USD 250 మిలియన్ల లంచం ఇచ్చినందుకు US ప్రాసిక్యూటర్లు అదానీ, ఆయ‌న‌ సహచరులపై అభియోగాలు మోపిన విష‌యంపై రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ప్ర‌స్తావించారు. గౌత‌మ్ అదానీ.. భారత్‌, అమెరికన్ చట్ట...
Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త, శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త, శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Trending News
Sabarimala Special Trains: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం శబరిమలకు అయ్య‌ప్ప భ‌క్తులు పోటెత్తుతున్నారు. సంక్రాంతి వరకూ భ‌క్తుల ర‌ద్దీ కొనసాగుతుంది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో రైళ్లు కిట‌కిట‌లాడుతుంటాయి. టికెట్ రిజర్వేషన్ కూడా ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. ఈ నేప‌థ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ స్పెషల్ ట్రైన్స్‌.. ఎప్పటి నుంచి, ఎక్కడి నుంచి అందుబాటులో ఓసారి ప‌రిశీలించండి..శబరిమల అయ్యప్ప భక్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.ఈ 26 రైళ్లు తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేరళ మధ్య రాక‌పోక‌లు సాగించ‌నున్నాయి. ఈ రైళ్లు నవంబర్ 18, 20, 22, 24, 25, 27, 29వ‌ తేదీల్లోనూ తిరిగి డిసెంబర్ 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30, జనవరి 1వ‌ తేదీల్లో నడవనున్నాయి. శబరిమలకు ప్రత్యేక రైళ...
General Coaches : రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. 370 రైళ్లకు అద‌నంగా 1000 జనరల్ కోచ్‌లు

General Coaches : రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. 370 రైళ్లకు అద‌నంగా 1000 జనరల్ కోచ్‌లు

Trending News
Indian Railway Expansion | ప్ర‌యాణికుల‌కు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. గత మూడు నెలల్లో వివిధ రైళ్లకు సుమారు 600 కొత్త జనరల్-క్లాస్ కోచ్‌ల (General Coaches ) ను జోడించింది. ఈ కోచ్‌లన్నీ సాధార‌ణ ఎక్స్ ప్రెస్‌ రైళ్లకు జ‌త‌చేశారు. నవంబర్ చివరి నాటికి, దాదాపు 370 సాధారణ రైళ్లలో వెయ్యికి పైగా జ‌న‌ర‌ల్ క్లాస్ కోచ్‌లు జోడించనున్నారు.రైల్వే ఫ్లీట్‌కు కొత్త కోచ్‌లను చేర్చడం వల్ల ప్రతిరోజూ సుమారు లక్ష మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కాకుండా, రాబోయే రెండేళ్లలో రైల్వే ఫ్లీట్‌కు భారీ సంఖ్యలో నాన్-ఏసీ క్లాస్ కోచ్‌లను జోడించే పని వేగంగా జరుగుతోంది.రైల్వే బోర్డు (ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ జ‌న‌ర‌ల్ క్లాస్‌ ప్రయాణికులకు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డానికి భార‌తీయ రైల్వే తొలి ప్రాధాన్య‌మిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ గ్రూపులోని ప్రయాణికులకు...
IRCTC refund policy | ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక.. క్యాన్సిల్ చేసిన టిక్కెట్లపై ఎంత వాపస్ వ‌స్తుందో తెలుసుకోండి..

IRCTC refund policy | ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక.. క్యాన్సిల్ చేసిన టిక్కెట్లపై ఎంత వాపస్ వ‌స్తుందో తెలుసుకోండి..

Trending News
IRCTC refund policy : ద‌స‌రా, దీపావళి, ఛత్ పూజ వంటి పండుగ సీజన్లలో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఏ స్థాయిలో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే.. రైళ్లలో రిజ‌ర్వేష‌న్ టికెట్ దొర‌క‌డం చాలా కష్టం. చాలాసార్లు, బుక్ చేసిన టిక్కెట్లు కూడా 'కన్ఫర్మ్స కావు. అయితే, అనేక సార్లు, ప్రయాణీకులు కూడా త‌మ జ‌ర్నీ ప్లాన్లు మార్చుకోవ‌డం, ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల టిక్కెట్లను కాన్సిల్ చేసుకుంటారు. అయితే మీ టిక్కెట్‌ను రద్దు చేసిన సమయం ఆధారంగా ఛార్జీలను భార‌తీయ రైల్వే తీసివేస్తుంది. అంతేకాకుండా, రైలు టికెట్ రద్దుకు వర్తించే వివిధ ఛార్జీల గురించి కూడా గందరగోళం ఉంది. అందువల్ల, రైలు రద్దు ఛార్జీల గురించి ఈ కథనంలో వివరాలను తెలుసుకోండి..మీరు భారతీయ రైల్వేలో ‘confirmed’, ‘RAC’, ' లేదా 'వెయిట్‌లిస్ట్'లో ఉన్న రైలు టిక్కెట్‌ను రద్దు చేస్తే, క్యాన్సిల్ చార్జీ విధిస్తుంది. మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, తగ్గించే మనీ.. మీరు కాన్సిల్...
Indian Railways | భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు..  ఒక్క‌రోజే ఒకే రోజు 3 కోట్ల మంది ప్ర‌యాణం..

Indian Railways | భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు.. ఒక్క‌రోజే ఒకే రోజు 3 కోట్ల మంది ప్ర‌యాణం..

Trending News
Indian Railways new record : భారతీయ రైల్వేలు నవంబర్ 4, 2024న ఒకే రోజులో 3 కోట్ల మంది రైళ్ల‌లో ప్ర‌యాణించారు. ఇది భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లోనే ఒక గొప్ప‌ మైలురాయి. దేశ రవాణా చరిత్రలో రైల్వేలు ఒక గొప్ప విజయాన్ని సాధించింద‌ని రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) చేసిన ఒక ప్రకటన విడుద‌ల చేసింది.నవంబర్ 4న, భారతీయ రైల్వే (Indian Railways)  120.72 లక్షల మంది నాన్-సబర్బన్ ప్రయాణీకులను తీసుకువెళ్లాయి, ఇందులో 19.43 లక్షల మంది రిజర్వ్ ప్రయాణికులు, 101.29 లక్షల మంది అన్ రిజర్వ్డ్ ప్రయాణీకులు ఉన్నారు, దీనితో పాటు రికార్డు స్థాయిలో 180 లక్షల సబర్బన్ ప్రయాణికులు ఉన్నారు. ఇది 2024లో అత్యధిక సింగిల్-డే ప్రయాణీకుల సంఖ్యగా రికార్డు నెలకొల్పింది. మొత్తం ప్రయాణీకుల రద్దీ ఈ రోజున 3 కోట్లకు పైగా చేరుకుంది. 6.85 కోట్ల మంది ప్రయాణికులు Indian Railways new record మంత్రిత్వ శాఖ ప్రకారం, షెడ్యూల్డ్ రైళ్ల ద...
ఆరేళ్లపాటు మంచం పట్టిన భర్తను భార్య సపర్యలు..  పూర్తిగా కోలుకున్నాక విడాకులు ఇచ్చిన భర్త..

ఆరేళ్లపాటు మంచం పట్టిన భర్తను భార్య సపర్యలు.. పూర్తిగా కోలుకున్నాక విడాకులు ఇచ్చిన భర్త..

Trending News
Malaysian woman | మంచాన పడి అచేతనంగా తన భర్తను ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంది. నెలలు కాదు.. ఏడాది కాదు.. ఏకంగా ఆరేళ్ల పాటు త‌న జీవితాన్ని పూర్తి గా భ‌ర్త‌కు స‌ప‌ర్య‌లు చేసేందుకే అంకితం చేసింది ఈ మలేషియా మహిళ. అయితే చివ‌ర‌కు ఆ భ‌ర్త పూర్తిగా కోలుకున్నాక అప్పటి వ‌ర‌కు అన్నీతానై సేవ‌లు చేసిన భార్యకు విడాకులిచ్చాడు. తిరిగి వెంట‌నే అతను మ‌రో మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడు. ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న ఇటీవ‌ల చోటుచేసుకుంది.వివ‌రాల్లోకి వెళితే.. 2016లో నూరుల్ సియాజ్వానీ (Nurul Syazwani) అనే మహిళలకు వివాహం జరిగింది. వివాహమైన రెండేళ్లకే ఆమె భర్త కారు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతను ఆరేళ్లపాటు అచేతనంగా మంచానికే పరిమితమయ్యాడు. సియాజ్వానీ త‌న భ‌ర్త‌కు నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా అతనికి ఆహారం ఇవ్వడం, డైపర్లు మార్చడం, స్నానం చేయడం వంటి రోజువారీ పనులను చేసింది. ప్ర‌తీ క‌ష్టంలోనూ తోడుగా నిలిచింది.ఆమె అ...