
చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..
కర్ణాటక రాష్ట్రంలో గడగ జిల్లాలో షాకింగ్ ఘటన
బెంగళూరు : మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. నేలపై కుప్పకూలిపోవడంతో అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ విచిత్రంగా కొద్ది సేపటికి అతడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన కర్ణాటకలోని గడగ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హీరేప్ప గ్రామంలోని ఓ ఇంటి వద్ద పాము కనిపించింది.అదే గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే వ్యక్తి మద్యం మత్తులో ఆ పామును చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేతి లో గరుడ రేఖ ఉందని... పాము కాటు వేయదంటూ గ్రామానికి దూరంగా వదిలేస్తానని చెప్పి దాన్ని పట్టుకున్నా డు. ఇంతలోనే పాము అతని చేతి నుంచి ఒకసారి జారిపోయింది.రెండో సారి పట్టుకున్నపుడు పాము అతడిని నాలుగు సార్లు కాటేసింది. కొంత దూరం నడిచిన సిద్ధప్ప కుప్పకూలిప...