Saturday, January 24Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

Chikkamagaluru | కర్ణాటకలో పాలస్తీనా జెండాలతో హల్‌చల్

Chikkamagaluru | కర్ణాటకలో పాలస్తీనా జెండాలతో హల్‌చల్

Trending News
Chikkamagaluru : కర్ణాటకలో నలుగురు మైనర్లు పాలస్తీనా జెండా (Palestinian Flag ) లతో వాహనాలపై ర్యాలీలు చేస్తూ హల్‌చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిక్కమగళూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలపై నలుగురు మైనర్లు పాలస్తీనా జెండాను ఎగురవేశారు. వీడియో సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు రంగంలోకి దిగి  నలుగురు మైనర్లను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌ల చేతికి జెండా ఎలా వచ్చింది? వారు స్వయంగా చేశారా లేదా ఎవరైనా  అలా చేయమని ప్రోత్సహించారానే కోణంలో దర్యాప్తు చేపట్టారు.ద్విచక్రవాహనంపై   వెనుక కూర్చున్న వ్యక్తి  పాలస్తీనా జెండా పట్టుకుని కనిపించడంతో స్థానిక హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భజరంగ్‌దళ్‌, భాజపా కార్యకర్తలు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగి నిందితులను వెంటన...
నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌..! టికెట్ ధరలు.. టైమింగ్స్‌, హాల్టింగ్ వివ‌రాలు ఇవే..

నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌..! టికెట్ ధరలు.. టైమింగ్స్‌, హాల్టింగ్ వివ‌రాలు ఇవే..

Trending News
Vande Bharat | భారతీయ రైల్వేశాఖ తెలంగాణ‌కు మ‌రో కొత్త వందేభార‌త్ రైలును ప్రారంభించింది. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య ఈ రైళ్లు ప్ర‌యాణ‌కుల‌కుసేవ‌లందిస్తున్నాయి. కాగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఆరు వందే భారత్‌ రైళ్లను ప‌చ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో తెలంగాణ‌కు నాగ్‌పూర్‌ - సికింద్రాబాద్‌ మధ్య తొలి వందే భారత్‌ రైలు కూడా ఉంది.ఇక ఈ రైలు ఈ నెల 19 నుంచి అందుబాటులో వ‌స్తుంది. ప్రతి మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు న‌డుస్తుంది. ఈ సెమీ హైస్పీడ్‌ రైలు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నాగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరుతుంది. 5.43 గంటలకు సేవ్‌గ్రామ్ స్టేష‌న్‌ కు చేరుతుంది. అక్కడి నుంచి 7.03 గంటలకు చంద్రాపూర్‌కు చేరుకొని.. 7.05 గంటలకు బయలు దేరుతుంది. 7.20 గంటలకు బల్హార్షా చేరుకొని.. 7.25 గంటలకు బయలుదేరి.. 9.08గంటలకు పెద్ద‌ప‌ల్లి జిల్లా రామగుండం స్టేషన్‌కు వస్తుంది. 10.04 గంటలక...
భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు వ‌చ్చేసింది.. దీని ప్రత్యేకతలు, టిక్కెట్ ఛార్జీలు, రూట్స్..

భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు వ‌చ్చేసింది.. దీని ప్రత్యేకతలు, టిక్కెట్ ఛార్జీలు, రూట్స్..

Trending News
Namo Bharat Rapid Rail | దేశంలోని ఆధునిక ఫీచర్లు, స‌మీప‌ న‌గ‌రాల మ‌ధ్య ప్ర‌యాణాల‌ను విప్ల‌వాత్మ‌కంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి 'వందే భారత్ మెట్రో' సేవలను సోమవారం (సెప్టెంబర్ 16) గుజరాత్‌లో ప్రారంభించారు. వందే భార‌త్ మెట్రో రైలు తొలి ప్రయాణం భుజ్ నుంచి అహ్మదాబాద్ మధ్య జరుగుతుంది. ఇది కేవలం 5 గంటల 45 నిమిషాల్లో 360 కి.మీ గ‌మ్యస్థానాన్ని చేరుకుంటుంది. . ఈ మెట్రో సర్వీసుకు సంబంధించిన రోజువారీ సర్వీస్ సెప్టెంబర్ 17న ప్రారంభమవుతుంది, పూర్తి ప్రయాణానికి టిక్కెట్ ధర రూ. 455 గా నిర్ణ‌యించారు. భారతీయ రైల్వే వందే భారత్ మెట్రో పేరును 'నమో భారత్ ర్యాపిడ్ రైల్' (Namo Bharat Rapid Rail) గా మార్చింది.వందే భారత్ మెట్రో సంప్రదాయ మెట్రోలకు ఎలా భిన్నంగా ఉంటుంది?ఢిల్లీ, ముంబైతో సహా దేశంలోని ఇతర ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇతర సాంప్రదాయ మెట్రోలకు రైళ్ల‌కు భిన్నంగా వందే మెట్రో ఉంటుంది....

Vande Bharat Metro | మొట్ట‌మొద‌టి వందే భారత్ మెట్రో రైలు ఫొటోలు చూశారా?

Trending News
Vande Bharat Metro  | గుజరాత్‌లోని అహ్మదాబాద్ - భుజ్ మధ్య నగరాల మధ్య ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సిద్ధ‌మైంది. ఈ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం సెప్టెంబ‌ర్ 15న‌ ఆవిష్కరించనున్నారు. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా ప‌లు రూట్ల‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ రైళ్లు విజయవంతంగా న‌డుస్తుండ‌గా ఇప్పుడు ప్ర‌ధాన న‌గ‌రాల మ‌ధ్య లోక‌ల్ జ‌ర్నీని మ‌రింత‌ మెరుగుప‌రిచేందుకు వందేభార‌త్ మెట్రో రైళ్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి.వారానికి 6 రోజులు వందే భారత్ మెట్రో రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది, ఇది భుజ్ నుంచి ఉదయం 5:05 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. అహ్మదాబాద్‌లో సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి తిరిగి రాత్రి 11:10 గంటలకు భుజ్ కు చేరుకుంటుంది. రైలు సబర్బతి, ఛందోయా, విరమ్‌గం, ధృంగధ్ర, హల్వాద్, సాంఖియాలి,...
Aadhaar Update | ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోలేదా..? అయితే మీకు మరో ఛాన్స్.. ఉచిత‌ అప్‌డేట్ గడువు పొడిగింపు

Aadhaar Update | ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోలేదా..? అయితే మీకు మరో ఛాన్స్.. ఉచిత‌ అప్‌డేట్ గడువు పొడిగింపు

Trending News
ఉచితంగా ఆధార్ (Aadhaar card ) ను ఇంకా అప్‌డేట్ చేసుకోలేదా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఆధార్ కార్డు వివ‌రాల‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం మ‌రో మూడు నెలల గడువును పెంచింది. గ‌తంతో ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 14 చివరి తేదీగా ఉండగా. ఇప్పుడు దానిని మ‌రో మూడు నెలల పాటు పొడిగించారు. ఈ క్రమంలో ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సదుపాయాన్ని డిసెంబర్ 14, 2024 (Aadhaar Update Last Date)వరకు పెంచిన‌ట్లు UIDAI వెల్ల‌డించింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మేలు జ‌రుగ‌నుంది. ఆధార్ అప్‌డేట్ చేయాల్సిందే.. ప్ర‌స్తుతం ఏ పనికైనా ఇప్పుడు ఆధార్ కార్డు ధ్రువీక‌ర‌ణ త‌ప్ప‌నిస‌రైంది. అది ప్రభుత్వ లేదా ప్రైవేట్ పనులను క‌చ్చితంగా ఆధార్ కార్డు కాపీ స‌మ‌ర్పించాల్సిందే.. దీంతో ఈ కార్డు ఎలాంటి తప్పులు లేకుండా అన్నీ క‌చ్చిత‌మైన వివ‌రాలు ఉండేలా చూసుకోవాల్సిన ఉంటుంది. ప్ర‌తీ 10 సంవత్సరాలకు...
Shimla mosque row | రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయడానికి 30 రోజుల గ‌డువు

Shimla mosque row | రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయడానికి 30 రోజుల గ‌డువు

Trending News
Shimla mosque row | సిమ్లాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, మునిసిపల్ కమిషనర్ కోర్టు శుక్రవారం సంజౌలిలోని మసీదుకు సంబందించి రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయాలని ఆదేశించింది. 30 రోజుల్లోగా నిర్మాణాన్ని కూల్చివేయాలని మసీదు నిర్వాహకులను కోర్టు ఆదేశించింది. అయితే గతంలో తీర్పు వెలువడే వరకు మసీదుకు సీల్ వేయాలని కమిషనర్ ఆదేశించారు.ఈ కేసు విచారణను మూడు నెలల్లో పూర్తి చేశామని మండి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్‌ఎస్ రాణా తెలిపారు. విచారణలో మ‌సీదు నిర్మాణాన్ని ఆమోదించలేదు, మ్యాప్ ఆమోదించ‌డలేదు. కాబట్టి ఇది చట్టవిరుద్ధమని కోర్టు నిర్ధారించింది. మసీదును పాత రూపంలోనే పునరుద్ధరించాలని కోర్టు తీర్పునిచ్చింది. మసీదు కమిటీ.. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకపోతే, మున్సిపల్ కార్పొరేషన్ ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తుంది. మసీదు కమిటీ కూడా 30 రోజుల్లోగా పై కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. హిందూ సంస్థల నిరసనలు మరోవైపు హ...
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలో 4000 కిలోల శాఖాహార విందు

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలో 4000 కిలోల శాఖాహార విందు

Trending News
Ajmer Sharif Dargah  | సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అజ్మీర్ షరీఫ్ దర్గా 4000 కిలోల శాకాహార విందును సిద్ధం చేశారు. "ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, "సేవా పఖ్వాడా"తో కలిసి, అజ్మీర్ దర్గా షరీఫ్‌లోని ప్రఖ్యాత "బిగ్ షాహీ దేగ్"లో మరోసారి 4000 కిలోల శాకాహార "లంగర్" తయారు చేసి పంపిణీ చేయనున్నారు. "ఆహారం, 550 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది" అని దర్గా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు."ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని మతపరమైన ప్రదేశాలలో సేవా కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా మేము 4,000 కిలోల శాఖాహారాన్ని సిద్ధం చేస్తాము. ఇందులో అన్నం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌ పంపిణీ చేయడంతోపాటు మత పెద్ద‌లు, పేదలకు కూడా ఆహారాన్ని అంద‌జేస్తామ‌ని అధికారులు తెలిపారు. "ప్రధానమంత్రి మోదీ ప...
Surat Bulldozer action | సూరత్ లోనూ బుల్ డోజర్ యాక్షన్.. అక్రమ కట్టడాల నేలమట్టం..!

Surat Bulldozer action | సూరత్ లోనూ బుల్ డోజర్ యాక్షన్.. అక్రమ కట్టడాల నేలమట్టం..!

Trending News
Surat Bulldozer action | సూరత్‌లోని వినాయ‌క మండ‌పంపై కొంద‌రు దుండ‌గులు రువ్విన ఘ‌ట‌న‌లో ఆగ్రహానికి గురైన అనేక హిందువులు, హిందూ సంస్థలు.. అరెస్టు చేసిన నిందితులపై బుల్‌డోజర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నివేదికల ప్రకారం, గుజరాత్‌లోని సూరత్‌లోని పోలీస్ స్టేషన్ వద్ద అనేక మంది హిందూ సంస్థ సభ్యులు గుమిగూడి, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. పలు కేసుల్లో యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించిన విధంగానే నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.దీని ఫలితంగా, సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలో స్థానిక యంత్రాంగం ఈ కేసులో అరెస్టయిన నిందితుల అక్రమ ఆస్తులను బుల్డోజర్‌తో ధ్వంసం చేయడం ప్రారంభించింది. బుల్డోజర్ చర్యకు సంబంధించిన‌ వీడియోలు ఇప్ప‌డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, ప్రజలు కూడా గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీని ప్రశంసించారు.సెప్టెంబరు 7, 8 తేదీల్ల...
Monkey pox : భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు.. అప్రమత్తమైన కేంద్రం..

Monkey pox : భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు.. అప్రమత్తమైన కేంద్రం..

Trending News
Monkey pox : ప్ర‌స్తుతం మంకీపాక్స్ వైరస్ యావ‌త్‌ ప్రపంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇప్పటివరకు ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో వ్యాప్తి చెందిన‌ మంకీపాక్స్ ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటించింది.. దిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లు వెల్ల‌డించింది. మంకీపాక్స్ లక్షణాలతో అనుమానించిన కేసు.. Mpox (మంకీపాక్స్) పాజిటివ్‌గా గుర్తించిన‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.. పరీక్ష ఫలితాల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 Mpox వైరస్ ఉన్న‌ట్లు నిర్ధారించిందని తెలిపింది. అయితే ఇప్పటివరకు ఒకటే కేసు నమోదైందని.. అంతకు ముందు జూలై 2022 నుంచి భారతదేశంలో 30 కేసులు నమోదైనట్లు వివ‌రించింది. ఈ వైరస్ ప‌ట్ల ఎవ‌రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. WHO ప్రకారం.. mpox క్లాడ్ 1 హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించింది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత...
WATCH | 25 ఏళ్ల తర్వాత తొలిసారి కార్గిల్ యుద్ధంలో పాత్రను అంగీకరించిన పాక్ సైన్యం

WATCH | 25 ఏళ్ల తర్వాత తొలిసారి కార్గిల్ యుద్ధంలో పాత్రను అంగీకరించిన పాక్ సైన్యం

Trending News
KARGIL WAR | 25 ఏళ్ల క్రితం 1999 లో జ‌రిగిన‌ కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొన్నట్లు పాకిస్థాన్ ఆర్మీ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. దేశ రక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రసంగిస్తూ 1965, 1971, 1999లో కార్గిల్‌లో యుద్ధాల్లో పలువురు సైనికులు తమ ప్రాణాలను అర్పించారని వెల్ల‌డించారు. "పాకిస్తానీ కమ్యూనిటీ అనేది ధైర్యవంతుల సంఘం, "అది 1948, 1965, 1971, 1999 కార్గిల్ యుద్ధం కావచ్చు, వేలాది మంది షుహాదాలు (అమరవీరులు) పాకిస్తాన్ కోసం తమ ప్రాణాలను అర్పించారు అని రావల్పిండిలో జరిగిన కార్యక్రమంలో ఆయన అన్నారు.ఇదివ‌రకెప్పుడూ పాకిస్తాన్ సైన్యం 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న‌ట్లు బహిరంగంగా అంగీకరించలేదు చొరబాటుదారులను "కాశ్మీరీ స్వాతంత్ర్య సమరయోధులు" లేదా "ముజాహిదీన్ లు అంటూ పేర్కొంటూ వ‌చ్చింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తాజా వ్యాఖ...