Home » శ్రీ‌దేవి అభిమానులకు కానుక‌
The Life Of A Legend

శ్రీ‌దేవి అభిమానులకు కానుక‌

Spread the love

The Life Of A Legend పేరుతో త్వ‌ర‌లో బ‌యోగ్ర‌ఫీ..

భాష‌తో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానుల హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్నారు అం నటి శ్రీదేవి. 2018, ఫిబ్రవరి 24న శ్రీ‌దేవి 54ఏళ్ల వ‌య‌స్సులోనే ఆమె లోకాన్ని వీడింది. 80’s 90’s వ దశకంలో వెండితెర రాణిలా ఓ వెలుగు వెలిగింది. కాగా శ్రీదేవి భర్త-నటుడు-నిర్మాత బోనీ కపూర్.. శ్రీ‌దేవి జీవిత చరిత్రను ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ ( The Life Of A Legend ) పేరుతో పుస్తకాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించ‌డంతో ఆమె అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ధీరజ్ కుమార్ రాసిన ఈ బయోగ్రాఫికల్ ప్రచురణ హక్కులను వెస్ట్‌ల్యాండ్ బుక్స్ సొంతం చేసుకుంది.

ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్

సినీ ప్ర‌పంచంలో శ్రీ‌దేవి (Sridevi) అద్భ‌త‌మైన జైత్ర‌యాత్ర‌కు సంబంధించి అన్నివివ‌రాల‌ను ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పుస్త‌కంలో పొందుప‌రిచిన‌ట్లు ప్ర‌చుర‌ణ క‌ర్త‌లు వెల్ల‌డించారు. భారతదేశంలోని “గొప్ప క‌ళాకారుల్లో శ్రీదేవి ఒకర‌ని, ఆమె జీవితంలోని అన్ని కోణాల‌ను స్పృశిస్తూ The Life Of A Legend పుస్త‌కాన్ని తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు.
ట్విట్టర్‌లో ఈ వార్త వెలువడిన వెంటనే, నెటిజన్లు సంతోషంతో తమ స్పందనలను పంచుకుంటున్నారు.

READ MORE  తెలుగులో రామాయణ యానిమే మూవీ విడుదల తేదీ ఖరారు..

1978లో, అమోల్ పాలేకర్‌కి జోడీగా బాలీవుడ్ చిత్రం సోల్వా సావన్‌లో శ్రీదేవి తొలిసారిగా కథానాయికగా నటించింది. ఆమె 40ఏళ్ల పాటు సినీ ప్ర‌స్థానం సాగింది. సుమారు 300 కంటే ఎక్కువ సినిమాల్లో న‌టించింది.

శ్రీ‌దేవి తండ్రి అయ్యప్పన్, ఆయన ఒక న్యాయవాది. తల్లి రాజేశ్వరి. శ్రీదేవికి సోదరి శ్రీలత, సోదరుడు సతీష్ ఉన్నారు. ఆమె బాలివుడ్ సినీ నిర్మాత, బోనీకపూర్ ను 1996 జూన్ 2న వివాహం చేసుకున్నారు. వీరికి ఝాన్వి, ఖుషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శ్రీ‌దేవి సినీ ప్ర‌స్థానం సంక్షిప్తంగా..

శ్రీ‌దేవి తన నట జీవితాన్ని బాల నటిగా కన్దన్ కరుణై (1967) అనే తమిళ చిత్రంతో ప్రారంభించారు. ఐతే 1975 లో విజయచిత్ర అనే ఓ తెలుగు పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తుణైవన్ అనే చిత్రం తన మొదటి తమిళ చిత్రం అని శ్రీ‌దేవి పేర్కొన్నారు. నటిగా తొలుత ఎక్కువగా తమిళం,, మలయాళం చిత్రాలలో నటించారు. ఆమె నటించిన మలయాళం చిత్రాలకు ఎక్కువగా ఈవీ. శశి దర్శకత్వం వహించారు. ఆమె నటించిన మలయాళ చిత్రాల్లో ఆద్యపాదం, ఆలింగనం, కుట్టవుం శిక్షయుం, ఆ నిమిషం వంటివి ఉన్నాయి.. 1976లో లెజెండ్ డైరెక్ట‌ర్ బాలచందర్ తీసిన “మూండ్రు ముడిచ్చు”లో కమల్ హాసన్, రజనీ కాంత్ లతో శ్రీ‌దేవి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. మూండ్రు ముడిచ్చు తర్వాత శ్రీదేవి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో కమల్ హాసన్, రజనీ కాంత్‌తో కలిసి నటించారు. కమల్ తో, ఆమె గురు, శంకర్ లాల్, సిగప్పు రోజాక్కల్. తాయిళ్లామాల్ నానిల్లై, మీండుం కోకిల, వాయ్వే మాయం, వరుమైయిన్ నిరం సిగప్పు, నీలా మలార్గల్, మూండ్రాం పిరై, 16 వయదినిలే త‌దిత‌ర సినిమాల్లో నటించారు. రజనీ కాంత్‌తో ఆమె ధర్మయుద్ధం, ప్రియ, పొక్కిరి రాజా, టక్కర్ రాజా, అడుతా వారిసు, నాన్ అడిమై ఇల్లై చిత్రాలలో కలిసి నటించారు. 1975-85 కాలంలో తమిళ చిత్రసీమలో శ్రీ‌దేవి అగ్ర కథానాయికగా వెలుగొందారు.

READ MORE  viral video : కివీ పండు మొదటిసారి రుచి చూసినప్పుడు ఈ పిల్లాడి రియాక్షన్ చూడండి..

తెలుగులో టాప్ హీరోయిన్‌గా

అదే సమయంలో శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగారు. దాదాపు అంద‌రు టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించారు. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఆమె ఎక్కువ సినిమాల్లో క‌నిపించారు. ఎన్.టి.రామారావుతో కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి చిత్రాలలో నటించారు. అక్కినేని .నాగేశ్వరరావుతో ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక లో నటించారు. ఇక కృష్ణతో కలిసి ఆమె కంచుకాగడా, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు చిత్రాలలో నటించారు. కమల్ హాసన్ త‌ర్వాత శ్రీదేవి ఎక్క‌వుగా సూప‌ర్ స్టార్ కృష్ణ తో ఎక్కువ చిత్రాలలో క‌నిపించారు. ఇక బాలీవుడ్‌లో ఎక్కువగా జితేంద్రతో నటించారు, వాటిలో అధిక శాతం తెలుగు నుండి అనువదించబడినవే. అందులోనూ కె. రాఘవేంద్ర రావు, కె.బాపయ్య దర్శకత్వం వహించినవే ఉన్నాయి. .

READ MORE  Venom The Last Dance trailer | మరో ప్రపంచానికి తీసుకెళ్లేందుకు సిద్ధమైన టామ్ హార్డీ వెనమ్ పార్ట్-3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..