
Maha shivratri 2026 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 ప్రధాన శైవక్షేత్రాలకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 14 నుంచి 16 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
ప్రముఖ శైవక్షేత్రాలు – బస్సుల వివరాలు:
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఆలయాలకు కేటాయించిన బస్సులు:
- శ్రీశైలం: 781 సర్వీసులు
- వేములవాడ: 416 సర్వీసులు
- కీసరగుట్ట: 326 సర్వీసులు
- ఏడుపాయల: 249 సర్వీసులు
- వేలాల: 127 సర్వీసులు
- కాళేశ్వరం: 71 సర్వీసులు
- ఇతర క్షేత్రాలు (కొమురవెల్లి, రామప్ప, పాలకుర్తి మొదలైనవి): 273 సర్వీసులు
మహిళలకు ‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఈ ప్రత్యేక బస్సుల్లో (పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్) మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది. ప్రయాణ సమయంలో మహిళలు విధిగా ‘జీరో టికెట్’ తీసుకోవాలని అధికారులు సూచించారు.
టికెట్ ధరలు & రిజర్వేషన్: ప్రత్యేక సర్వీసుల నిర్వహణ దృష్ట్యా, స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలు 1.5 రెట్లు (1.5 Times) ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్ బస్సుల్లో పాత ధరలే ఉంటాయి. ముందస్తు బుకింగ్ కోసం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. www.tsrtconline.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లో బయలుదేరే పాయింట్లు: ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్.
ప్రయాణికుల సౌకర్యాలు:
బస్టాండ్ల వద్ద భక్తుల కోసం షామియానాలు, తాగునీరు, కుర్చీలు మరియు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎండీ వై. నాగిరెడ్డి గారు అధికారులతో సమీక్ష నిర్వహించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయం కోసం కాల్ సెంటర్: 040-69440000, 040-23450033 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

