Group 1 Mains | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు
Group 1 Mains | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. టీజీపీఎస్సీ కార్యాలయం నుంచి చైర్మన్ మహేందర్ రెడ్డి, సభ్యులు, సచివాలయం నుంచి డీజీపీ జితేందర్, కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, ఎస్పీడీసీఎల్ ఎండీ ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా శాంతి కుమారి మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చే
శామని, అన్ని కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో తొలిసారి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు (Group 1 Mains Exams ) జరుగుతున్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక టెక్నాలజీ, సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉందని, ఈ పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా అనేక సవాలుతో కూడుకుంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అపోహలు, పుకార్లకు తావివ్వకుండా సరైన జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.